కోడికత్తి కేసులో నిందితుడు శ్రీనివాసరావు బెయిల్ రద్దు చేసేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మంజూరు చేసిన బెయిల్ ఉత్తర్వులపై జోక్యానికి ధర్మాసనం అంగీకరించలేదు. 2019 ఎన్నికలకు ముందు విశాఖ ఎయిర్ పోర్టులో అప్పటి ప్రతిపక్ష నేత జగన్ పై శ్రీనివాసరావు కోడికత్తితో దాడి చేశాడు.
ఈ కేసును దర్యాప్తు చేసిన ఎన్ఐఏ.. నిందితుడు శ్రీనివాస్ ను అరెస్ట్ చేసింది. సుమారు ఐదేళ్లపాటు జైలులో ఉన్న శ్రీనివాసరావుకు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ బెయిల్ ను రద్దు చేయాలంటూ ఎన్ఐఏ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారణ జరిపిన ధర్మాసనం బెయిల్ రద్దుకు నిరాకరించింది.