కేంద్రం, ఈసీ, ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల పెంపుపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. తెలంగాణలో అసెంబ్లీ సీట్లను 119నుంచి 153కు పెంచాలని పిటిషన్ వేసింది. అలాగే ఏపీలో అసెంబ్లీ సీట్లను 175నుంచి 225 వరకు పెంచాలని పిటిషన్ లో పేర్కొన్నారు. విభజన చట్టం నిబంధనలను అమలు చేసేలా కేంద్రాన్ని ఆదేశించాలని పిటిషన్ వేశారు. కేంద్రం, ఈసీ, ఏపీ, తెలంగాణలను పిటిషనర్ ప్రతివాదులుగా చేర్చారు. ఇందుకు సంబంధించి సుప్రీంకోర్టు కేంద్రం, ఈసీ, ఏపీ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది.
Advertisement
తాజా వార్తలు
Advertisement