ఢిల్లీ: ఓబుళాపురం మైనింగ్ కేసులో ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మికి సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది. ఈ కేసులో శ్రీలక్ష్మిపై అభియోగాలను కొట్టివేస్తూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సీబీఐ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ చేపట్టిన జస్టిస్ ఎ.ఎస్.బోపన్న, జస్టిస్ ఎం.ఎం సుందరేశ్‌లతో కూడిన ధర్మాసనం.. శ్రీలక్ష్మికి నోటీసులు జారీ చేసింది.
ప్రస్తుతం ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఆమె ఉన్నారు. ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా వై.ఎస్.రాజశేఖరరెడ్డి ఉన్న సమయంలో శ్రీలక్ష్మి అధికార దుర్వినియోగానికి పాల్పడి ఓబుళాపురం మైనింగ్ కంపెనీకి 2007లో అక్రమంగా గనులు కేటాయించారంటూ సీబీఐ కేసులు నమోదు చేసింది. అయితే దీనిపై విచారణ జరిపిన హైకోర్టు శ్రీలక్ష్మీకి క్లిన్ చిట్ ఇచ్చింది..