ఢిల్లీ: వైకాపా మాజీ ఎంపీ నందిగం సురేశ్ కు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఆయనకు కోర్టు బెయిల్ నిరాకరించింది. వెలగపూడిలో మరియమ్మ హత్య కేసులో నందిగం సురేశ్ నిందితుడిగా ఉన్నారు. ఈ కేసులో బెయిల్ కోరుతూ ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. బెయిల్ పిటిషన్ ను తిరస్కరిస్తూ కోర్టు తాజాగా ఉత్తర్వులు ఇచ్చింది.
- Advertisement -