Tuesday, November 26, 2024

కోవిడ్ వ్యాక్సినేషన్‌పై సుప్రీంకోర్టు కీల‌క వ్యాఖ్య‌లు

కోవిడ్ వ్యాక్సినేషన్‌పై సుప్రీంకోర్టు కీలకమైన ఆదేశాలు ఇచ్చింది. కట్టడి కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. దీనికోసం వ్యాక్సినేషన్ ప్రక్రియను ముమ్మరం చేశాయి. బలవంతంగా ఎవరికి టీకాలు ఇవ్వొద్దని సూచించింది. టీకా తీసుకోమని ఎవరిపై ఒత్తిడి చేయలేమని చెప్పింది. అలాగే టీకా ప్రతికూల ప్రభావాలపై నివేదికలను రిలీజ్ చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. నిజానికి వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి ప్రభుత్వం టీకా ప్రక్రియను వేగవంతం చేసింది. ఇందులో భాగంగానే చిన్న పిల్లలకు సైతం వ్యాక్సిన్‌లు ఇవ్వడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇప్పటికే టీనేజర్లు కూడా టీకాలు తీసుకుంటున్నారు. కానీ ఇంకా కొన్ని గ్రామాల్లో టీకాపై అవగాహన లేక.. చాలామంది వ్యాక్సిన్‌లు వేయించుకోవాలంటే భయపడుతున్నారు. చాలా రాష్ట్రాల్లో ఈ పరిస్థితి ఉంది. కానీ ఆరోగ్య సిబ్బంది వారికి నచ్చచెబుతూ టీకాలు ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో టీకాలపై సుప్రీంకోర్టు కీలకమైన వ్యాఖ్యలు చేసింది. ఎవరికీ బలవంతంగా టీకాలు వేయకూడదని పేర్కొంది. అయితే ప్రజల ఆరోగ్యం దృష్ట్యా వ్యక్తిగత హక్కులపై కొన్ని పరిమితులు విధించవచ్చని కోర్టు స్పష్టంగా చెప్పింది. అలాగే వ్యాక్సిన్‌‌లు తీసుకోని వారిని బహిరంగ ప్రదేశాల్లో తిరగకూడదనే నిబంధనను కోర్టు తప్పుబట్టింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement