Friday, November 22, 2024

అల్లూరి జిల్లాలో సుప్రీంకోర్టు న్యాయమూర్తుల పర్యటన..

పాడేరు, (అల్లూరి జిల్లా) ప్రభ న్యూస్‌: అల్లూరి జిల్లాలోని అరుకులో జరిగిన న్యాయమూర్తుల పర్యటన విజయవంతంగా ముగిసింది. ముందుగా ఉదయం 10.35 గంటలకు రైలులో అరకు చేరుకున్న సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఉదయ్‌ ఉమేష్‌ లలిత్‌, రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌ కుమార్‌ మిశ్రా, రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ అసనుద్దీన్‌ అమానుల్లా లకు జిల్లా కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌, ఎస్పి సతీష్‌ కుమార్‌, ఐటీడీఏ పీఓ రోణంకి గోపాలకృష్ణ, సబ్‌ కలెక్టర్‌ వి. అభిషేక్‌ గిరిజన సాంప్రదాయ థింసా నృత్య కళాకారులు ఘన స్వాగతం పలికారు.

రైల్వే అతిథిగృహంలో కాసేపు విశ్రమించి పద్మావతి బోటానికల్‌ గార్డెన్‌ చేరుకుని టాయ్‌ -టైన్‌ లో పర్యటించి గార్డెన్‌ అంతా పరిశీలించారు. తదుపరి -టైబల్‌ మ్యూజియం సందర్శించి వివరాలు తెలుసుకున్నారు.అనంతరం పెదలబుడు గిరి గ్రామ దర్శిని సందర్శించారు. ఈ సందర్భంగా గిరిజన సాంప్రదాయ పద్ధతిలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఉదయ్‌ ఉమేష్‌ లలిత్‌ దంపతులు వివాహం చేసుకుని ఆనందించారు. థింసా నృత్యాలు తిలకించిన సుప్రీంకోర్టు న్యాయమూర్తి దంపతులు థింసా నృత్యంలో పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement