న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : తిరుచానూరులోని పద్మావతి కాంప్లెక్స్‌ను బాలాజీ జిల్లా నూతన కలెక్టరేట్ కార్యాలయంగా మార్చడంపై దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఈ పిటిషన్‌పై బుధవారం జస్టిస్ చంద్రుచూడ్ ధర్మాసనం విచారణ జరిపింది. హైకోర్టు ఇచ్చిన తీర్పులో జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని, అత్యున్నత ధర్మాసనం పిటిషన్‌ను డిస్మిస్ చేసింది. కలెక్టరేట్ కార్యాలయం రావడం వల్ల ఆ ప్రాంతంలో అభివృద్ధి జరుగుతుందని, కలెక్టర్ చెట్టు కింద కూర్చుని పని చేయలేరు కదా అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వానికి సముచిత గౌరవం ఇవ్వాలని స్పష్టం చేసింది. జిల్లాల పునర్విభజన చేసుకునే అధికారం ప్రభుత్వానికి ఉందని ధర్మాసనం తెలిపింది.
పద్మావతి కాంప్లెక్స్‌పై పిటిషన్‌ను కొట్టేసిన సుప్రీంకోర్టు.. కలెక్టర్ చెట్టుకింద కూర్చుని పనిచేయలేరన్నధర్మాసనం
Advertisement
తాజా వార్తలు
Advertisement