ఏపీ స్కిల్ కేసులో చంద్రబాబుకు ఏపీ హైకోర్టు ఇచ్చిన బెయిల్ ను రద్దు చేయాలని కోరుతూ సుప్రీం కోర్టులో ఏపీ సీఐడీ స్పెషల్ లీవ్ పిటిషన్ వేసింది. ఈ పిటిషన్పై విచారణ వాయిదా వేసింది సుప్రీంకోర్టు. స్కిల్ కేసులో చంద్రబాబు బెయిల్ రద్దు చేయాలంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది ఏపీ సీఐడీ.. అయితే, ఈ కేసులో తదుపరి విచారణను ఫిబ్రవరి 26వ తేదీకి వాయిదా వేసింది సుప్రీం ధర్మాసనం..
హరీష్ సాల్వే కొన్ని ఇబ్బందుల వల్ల ఈరోజు కోర్టుకు రాలేక పోయారని కోర్టు దృష్టికి తీసుకెళ్లిన న్యాయవాది సిద్ధార్థ లూథ్రా.. ఈ కేసును మూడు వారాలు వాయిదా వేయాలని కోరారు.. అయితే వీలైనంత త్వరగా డేట్ ఇవ్వండని కోరారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ తరపు న్యాయవాది రంజిత్ కుమార్.. ఇక, ఇరువర్గాల వాదనలు విన్న సుప్రీంకోర్టు.. దాంతో ఈ కేసును రెండు వారాలు కేసును వాయిదా వేసింది.. ఫిబ్రవరి 26వ తేదీన కేసు విచారణ ఉంటుందని తెలిపింది ధర్మాసనం.. జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ పంకజ్ మిట్టల్ ధర్మాసనం ఈ నెల 26వ తేదీన కేసు విచారణ చేపట్టనుంది..