Wednesday, January 15, 2025

Supreme Court | చంద్రబాబు బెయిల్ ర‌ద్దు పిటిష‌న్ కొట్టివేత

ఢిల్లీ: సుప్రీంకోర్టులో చంద్రబాబుకు ఊరట లభించింది. స్కిల్ కేసులో బెయిల్ రద్దు చేయాలని గత ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ ను జస్టిస్ బేలా త్రివేది ధర్మాసనం కొట్టివేసింది. ఈ కేసులో ఇప్పటికే ఛార్జిషీట్ ఫైల్ చేశారని రాష్ట్ర ప్రభుత్వం తరపు న్యాయవాది ముకుల్ రోహత్గీ కోర్టుకు తెలిపారు.

అందువల్ల బెయిల్ రద్దు పిటిషన్ లో జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని జస్టిస్ బేలా త్రివేది ధర్మాసనం పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన బెయిల్ రద్దు పిటిషన్ ను డిస్మిస్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. అవసరమైన‌ సందర్భంలో విచారణకు సహకరించాలని చంద్రబాబుకు సుప్రీంకోర్టు సూచించింది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement