Sunday, November 24, 2024

Viveka Case – ఎర్ర గంగిరెడ్డికి సుప్రీం షాక్ … బెయిల్ పై స్టే…

న్యూఢిల్లీ – వివేకా హత్య కేసులో ఏ1 నిందితుడు ఎర్ర గంగిరెడ్డికి సుప్రీంకోర్టులో షాక్ ఇచ్చింది. జులై 1న గంగిరెడ్డిని జైలు నుంచి విడుదల చేయాలన్న తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులపై సుప్రీంకోర్టు స్టే విధించింది. వివరాల్లోకి వెళ్తే గంగిరెడ్డి డీఫాల్ట్ బెయిల్ ను రద్దు చేస్తూ గత నెల 27న హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. జూన్ 30లోగా దర్యాప్తును పూర్తి చేయాలని సీబీఐకి సుప్రీంకోర్టు గడువు విధించినందున జులై 1న ఆయనను విడుదల చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. దీంతో, హైకోర్టు తీర్పును వివేకా కుమార్తె సునీత సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. ఆయనకు బెయిల్ ఇస్తే సాక్షులను ప్రభావితం చేస్తారని పిటిషన్ లో ఆమె పేర్కొన్నారు. పిటిషన్ ను విచారించిన సుప్రీం ధర్మాసనం జులై 1న గంగిరెడ్డిని విడుదల చేయాలన్న హైకోర్టు ఆదేశాలపై స్టే విధించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement