Monday, November 18, 2024

Breaking: ఉగ్రవాదులకు సపోర్టు.. ఏపీ, తెలంగాణలోని అనుమానితుల ఇళ్లల్లో ఎన్​ఐఏ సోదాలు!

ఉగ్ర‌వాద సంస్థ‌ల‌కు స‌పోర్ట్ చేస్తున్నార‌న్న కార‌ణంగా ప‌లువురు అనుమానిత‌ల ఇండ్ల‌ల్లో ఎన్ ఐ ఏ (నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ) ఇవ్వాల (ఆదివారం) సోదాలు చేస్తోంది. ఏపీ, తెలంగాణలో ఈ సోదాలు నిర్వహిస్తోంది. నిజామాబాద్, కర్నూల్, గుంటూరు జిల్లాలో ఎన్​ ఐ ఏ సోదాలు కొనసాగుతున్నాయి. నిజామాబాద్ లో 23 బృందాలు ఈ సోదాల్లో పాల్గొంటున్నాయి. అదేవిధంగా కర్నూల్, కడప, నెల్లూరు జిల్లాల్లో కూడా 23 బృందాలతో ఎన్​ ఐ ఏ సోదాలు చేపట్టింది. గుంటూరు జిల్లాలో రెండు బృందాలతో కొనసాగుతున్న NIA సోదాలు.

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఉగ్రవాద కార్యకలాపాలపై ఎన్​ ఐ ఏ ఫోకస్​ పెట్టింది. కాగా, PFI జిల్లా కన్వీనర్ షాదుల్లా సహా మహమ్మద్ ఇమ్రాన్, మహమ్మద్ అబ్దుల్ మోబిన్ లను పోలీసులు అరెస్ట్ చేశారు.
వీరిపై దేశ ద్రోహం కేసులు నమోదు చేశారు. కరాటే శిక్షణ, లీగల్ అవేర్ నెస్ ముసుగులో పి ఎఫ్.ఐ కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్టు కనుగొన్నారు. అంతేకాకుండా మతకలహాలు సృష్టించేందుకు
చురుకైన తీవ్రవాదులు మతోన్మాదులకు శిక్షణ ఇస్తున్నట్లు NIA గుర్తించింది. ఇవన్నీ కూడా బైంసా అల్లర్లతో సంబంధాలున్నట్టు తెలుస్తోంది. ఇక.. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం ఖాజానగర్​లో ఒక వ్యక్తి 3 నెలలుగా కనిపించకుండా పోయాడు. టిఫిన్​ సెంటర్​ నిర్వహిస్తున్న ఇలియాజ్​ కనిపించకుండా పోవడంతో అతనికి తీవ్రవాద గ్యాంగులతో సంబంధాలున్నయన్న అనుమానంతో వారి ఇంట్లో సోదాలు చేపట్టారు. వారి కుటుంబ సభ్యులను పలు రకాలుగా ప్రశ్నిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement