Friday, November 22, 2024

ఫుడ్‌ సేప్టీపై హెల్త్‌ క్లినిక్‌ల పర్యవేక్షణ, వైజాగ్‌లో ఆహార నాణ్యత పరీక్షా కేంద్రం

అమరావతి, ఆంధ్రప్రభ: ఆహార భద్రతకు సంబంధించి హెల్త్‌ క్లినిక్‌ల ద్వారా కూడా పర్యవేక్షణ ఉండేలా చర్యలు చేపట్టనున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడుదల రజని స్పష్టం చేశారు. భారత ఆహార భ్రదత, ప్రమాణాల సంస్థ సీఈవో అరుణ్‌ సింఘాల్‌ తో పాటు ఎఫ్‌ఎస్‌ ఎస్‌ ఏఐ (ఫుడ్‌ సేప్టీ అండ్‌ స్టాండర్డ్‌ అథారిటీ- ఆఫ్‌ ఇండియా) ప్రతినిధులు మంగళవారం మంత్రి విడదల రజినితో భేటీ అయ్యారు. ఆహార భద్రత, నాణ్యత విషయంలో దేశంలో తీసుకొస్తున్న మార్పులు, ఆంధ్రప్రదేశ్‌లో అమలు చేస్తున్న, తీసుకురావాల్సిన మార్పుల విషయమై ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ సీఈవోతోపాటు, ఆ సంస్థ ప్రతినిధులు మంత్రితో చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి విడదల రజిని మాట్లాడుతూ ప్రతి ఎఎన్‌ ఎంకు శిక్షణ ఇచ్చి ఆహార నాణ్యతను వారు కూడా పరిశీలించేలా మార్పులు తీసుకొస్తామన్నారు.

తొలుత వైజాగ్‌లో ఆహార నాణ్యత పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. ఆహార నాణ్యత విషయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాజీలేకుండా పనిచేస్తున్నారని తెలిపారు. జగనన్న గోరుముద్ద, సంపూర్ణ పోషణ ప్లస్‌ లాంటి పథకాలే అందుకు ఉదాహరణ అని చెప్పారు. వాలంటీర్‌ వ్యవస్థను ఫుడ్‌ సేప్టి, హెల్త్‌ లాంటి అంశాల్లో సమర్థంగా వినియోగించుకుంటామని, ఆ మేరకు ఒక విధానాన్ని రూపొందించనున్నట్లు వెల్లడించారు. వైద్యాన్ని ప్రతి ఇంటి ముంగిటకు తీసుకొచ్చిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికే దక్కుతుందన్నారు. ప్రతి 2వేల జనాభాకు ఒక వైఎస్సార్‌ హెల్త్‌ క్లినిక్‌ను తీసుకొచ్చి గ్రామీణ వైద్యవిధానాన్ని పూర్తిగా మార్చేశామని తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement