Saturday, November 23, 2024

Big Story: పగటి పూట ఎండ, రాత్రివేళ చలి.. ఏంటో ఈ కలికాలం!

ఏపీ, తెలంగాణలో విపరీత పరిస్థితులు కనిపిస్తున్నాయి. పగటిపూట ఎండ, రాత్రివేళ చలిగాలులు ఇబ్బందిగా మారుతున్నాయి. డిఫరెంట్​ వెదర్​ కండిషన్​తో ప్రజలు అనేక ఆరోగ్య సమస్యలకు గురవుతున్నారు. చిన్నపిల్లలు, వృద్దుళ్లో హెల్త్​ ఇష్యూస్​ పెరుగుతున్నాయంటున్నారు డాక్టర్లు. ఇక ఏపీలో ఎండలు ఠారెత్తిస్తున్నాయి. మార్చి మొదటి వారం నుంచే ప్రచండ భానుడు ప్రతాపాగ్ని చూపిస్తున్నాడు. ప్రస్తుతం 37 నుంచి 40 డిగ్రీల ఉష్ట్రోగ్రతలు నమోదవుతున్నాయి.

మార్చిలో40 నుంచి 42 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. గతేడాది మార్చి చివరి రోజు పశ్చిమ గోదావరి జిల్లా పెదపాడులో 45.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. 2021లో అదే అత్యధికంగా నమోదైంది. ఈ ఏడాది ఏప్రిల్‌ మే నెలల్లో 45 నుంచి 47 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. నిరుడితో పోలిస్తే ఈ ఏడాది ఎండల ప్రభావం ఎక్కువగాను ఉంటుందని అంచనా. ఆదివారం అత్యధికంగా కృష్ణా జిల్లాలో 39.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. కర్నూలులో 38.6, శ్రీకాకుళంలో 38.2, విజయనగరంలో 37.4, విశాఖపట్నంలో 36.5, తూర్పు గోదావరిలో 38.7, పశ్చిమ గోదావరిలో 39.4, గుంటూరులో 38.4, ప్రకాశంలో 38.3, నెల్లూరులో 39.6, చిత్తూరులో 39.2, కడపలో 39.3, అనంతపురంలో 38.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. గాలిలో తేమశాతం తక్కువ వ్వడమే ఎండల తీవ్రత పెరగడానికి కారణం అవుతోందని వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు.

గతేడాది మార్చి మొదటి వారంలో 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ ఏడాది ఉష్ణోగ్రతలు తక్కువగా ఉన్నప్పటికీ ఎండ వేడి మాత్రం బాగా పెరిగింది. ఈ ఏడాది కోస్తాంధ్ర సహా తెలంగాణలోని ఉత్తర, తూర్పు భాగాల్లో ఎండతీవ్రత బాగా పెరిగే అకాశం ఉందని వాతావరణ విభాగం పది రోజుల క్రితమే హెచ్చరించింది. పెరుగుతున్న ఉష్ణోగ్రతల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో గడిచిన నాలుగైదు రోజులుగా ఉదయం పది గంటల నుంచే సురీడు సుర్రు మనిపిస్తున్నాడు. ఉదయం 11 నుంచి 3.30 గంటల వరకు ఎండ తీవ్రత అధికంగా ఉంటుంది. దీంతో వివిధ పనులపై బయటకు వచ్చే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఏటా ఎండాలకాలంలో వడదెబ్బ తగిలి మృత్యువాత పడుతుంటారు. 2014లో 448 మంది మృతిచెందగా 2015లో 1,369 మంది, 2016లో 723 మంది, 2017లో 236 మంది, 2018లో 8 మంది, 2019లో 28 మంది మృతిచెందారు. 2020, 2021 సంవత్సరాల్లో కరోనా ఆంక్షల కారణంగా ప్రజలు ఇళ్ళకే పరిమితం కావాల్సి వచ్చింది. దీంతో రెండేళ్ళుగా వడదెబ్బ కారణంగా ఎవ్వరూ మృతి చెందలేదు.

ఈ ఏడాది కరోనా థర్డ్‌ వేవ్‌ పూర్తయిన నేపథ్యంలో సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. ప్రజలు రోజువారీ కార్యకలాపాల్లో నిమగ్నమవుతున్నారు. సాధారణంగా ఎండాకాలంలో వడదెబ్బ తలగడం, డీహైడ్రేషన్‌ కు గురవ్వడం లాంటి సమస్యలు వస్తాయి. ఎండ కాలంలో వీలైనంత వరకు ఇంటిపట్టు-నే ఉండటం మంచిదని, ముఖ్యమైన పనులు ఏమైనా ఉంటే ఉదయం 10 గంటలలోపే పూర్తి చేసుకోవాలని వైద్యులు చెబుతున్నారు. సమ్మర్‌లో నీటిని ఎక్కువ మోతాదులో తీసుకుంటే మంచిదని, మజ్జిగ, బార్లీ, కొబ్బరి నీరు తరుచు తీసుకుంటుండం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని తీసుకోవడం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement