వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ముందస్తు బెయిల్ పై స్టే ఇవ్వాలని కోరుతూ వైఎస్ సునీతారెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై విచారణను ఈనెల 13వ తేదీకి వాయిదా వేసింది సుప్రీంకోర్టు. ఇవాళ ఉదయం సుప్రీంకోర్టులో వైఎస్ సునీతా రెడ్డి తరపు న్యాయవాది తమ వాదనలు వినిపించారు.
వివేకానందరెడ్డి హత్య కేసులో వైఎస్ అవినాష్ రెడ్డి ప్రధాన కుట్రదారు అని వైఎస్ సునీతా రెడ్డి తరపు న్యాయవాది వాదించారు. స్థానిక ప్రభుత్వం కూడా అవినాష్ రెడ్డికే మద్దతిస్తుందని సునీతా రెడ్డి తరపు న్యాయవాది కోర్టులో వాదించారు. సీబీఐ విచారణను వైఎస్ అవినాష్ రెడ్డి అడ్డుకుంటున్నారని సునీతారెడ్డి తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. అయితే ఈ పిటిషన్ పై విచారణను ఈ నెల 13వ తేదీకి సుప్రీంకోర్టు వాయిదా వేసింది.