Friday, November 22, 2024

వివేకా కేసు: నార్కో పిటిషన్ డిస్మిస్

మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ వేసిన నార్కో పిటిషన్​ను కోర్టు తిర్కరించింది. ఈ కేసులో అనుమానితుడు సునీల్ యాదవ్‌కు నార్కో పరీక్షలకు అనుమతించాలని సీబీఐ వేసిన పిటిషన్​పై.. జమ్మలమడుగు కోర్టు మేజిస్ట్రేట్ విచారణ జరిపింది. కడప జైలు నుంచి వర్చువల్​గా సునీల్ యాదవ్​ను మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. నార్కో పరీక్షలకు సమ్మతమేనా అని మేజిస్ట్రేట్.. సునీల్​ను ప్రశ్నించింది. ఇందుకు బదులుగా తాను నార్కో పరీక్షలకు సమ్మతం కాదని సునీల్ యాదవ్ తెలిపారు. ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు.. సీబీఐ వేసిన పిటిషన్​ను డిస్మిస్ చేసింది.

కాగా, వివేకా హత్య కేసులో సునీల్ యాదవ్​ను సీబీఐ అధికారులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఆగస్టు 2న గోవాలో సునీల్ యాదవ్​ను అరెస్ట్ చేసినట్లు సీబీఐ అధికారులు.. అనంతరం జైలుకు తరలించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement