Saturday, November 16, 2024

Sunday Special – మ‌ట్టి గాజుల మురిపెం! స‌వ్వ‌డి చేస్తున్న చేతులు

అతివ‌ల అందానికి మ‌రింత సొగ‌సు తెచ్చేవి గాజులు. చేతికి గాజులు, కాళ్ల గజ్టెల‌ సవ్వడికి సంబుర‌ప‌డ‌నోళ్లు ఉండరంటే అతిశ‌యోక్తి కాదు. మరీ ముఖ్యంగా రంగురంగుల‌ గాజుల వన్నెలు.. చిన్నెలతో మురిసిపోతుంటారు మ‌గువలు. అందచందాలకే కాదు ఆరోగ్య పరిరక్షణలోనూ ఈ గాజులు కీలకంగా ఉంటాయ‌ని డాక్ట‌ర్లు కూడా చెబుతుంటారు. సంప్ర‌దాయానికి తోడు.. వైద్య ప‌రంగా ఇది నిరూపిత‌మైంది. ఇక‌.. సంక్రాంతి శోభ వచ్చేసింది. తెలంగాణ వనితలు తమ చేతి గాజుల సవ్వడితో మురిసిపోయే రోజులివి. మ‌రి గాజులంటే మగువలకు మక్కువెందుకు? చిన్న దెబ్బతో చిట్లిపోయే మ‌ట్టి గాజులంటే అంత ప్రేమెందుకు? ఈ ఆదివారం ప్ర‌త్యేక క‌థ‌నంలో చ‌దివి తెలుసుకుందాం.

తెలంగాణలో ఈ సంస్కృతి, అసాధారణం. అపూర్వం. వర్ణనాతీతం. తన కడుపున పుట్టిన బిడ్డ శ్రేయస్సు, క్షేమం ప్రతీ తల్లికి ముఖ్యం. తన బిడ్డ చక్కగా ఎదగాలి. ఎల్లవేళలా చల్లగా ఉండాలి. ఎలాంటి కీడు దాపురించకూడదు. మారాజు యోగ్యతతో మనుగడ సాధించాలి. ఇందుకు మంచి మట్టి గాజులు ధరించాలి. అదీ సొంత డబ్బుతో కాదు. ఇద్దరు మగ బిడ్డల తల్లి నుంచి ఒకే ఒక కొడుకు, లేదా కూతురున్న తల్లి, నజరానా తీసుకోవాలి. ఆ డబ్బులతో గాజులు కొనాలి. తాను ధరించాలి. ఇలా గాజులు కొనుక్కోవటానికి డబ్బులు అడిగే తల్లికి తప్పని సరిగా.. ఆమె వారసత్వం కోసమే కాదు.. తన వారసత్వ క్షేమం కోసమూ మహిళామూర్తులు గాజుల మామూళ్లు ఇస్తారు. అంతే కాదు, ఉత్తరాయణ సంక్రమణ దశలో,, మకర సంక్రాంతి సందర్భంగా ఆ సూర్యభగవానుడిని ఆరాధిస్తారు. కృతజ్ఙతలు తెలుపుతారు. ఇక మహావిష్ణువు, శ్రీ లక్ష్మీని పూజిస్తారు. అందరూ క్షేమంగా ఉండాలి. అందరిలో మేమూ ఉండాలనే నానుడి.. సంక్రాంతి సందర్భంగా తెలంగాణ మహిళల్లో విస్పష్టం.

గాజులంటే.. మట్టి గాజులేనమ్మా..
తెలంగాణ సంస్కృతిలో,, మహిళలు ప్రాణ సమానంగా గాజులను ఆరాధిస్తారు. డబ్బున్న మారాణులైతే వజ్రాల గాజలతో ఫోజిస్తారు. ఎన్నో రంగుల రంగుల గాజులు ధరించటానికే ఇష్టపడతారు. ధనవంతులు బంగారు గాజులు ధరించవచ్చు. కానీ ఎల్లవేళలా రంగు రంగుల గాజులకు ఇచ్చే విలువ, గౌరవం బంగారు గాజులకు దక్కదంటే ఆశ్చర్యపోనక్కరలేదు. మట్టి గాజులంటే ఆడబిడ్డలు అల్లాడిపోతుంటారు. . బీరువాలో ఎన్ని డిజైన్లలో గాజులు ఉన్నా.. మళ్లీ ఇంకో డజన్‍ గాజులు తీసుకుంమని మధ్యతరగతి మహిళ భావిస్తుంది. ప్రతి చీరకు కూడా మ్యాచింగ్‍ గాజులు కొంటుంది. కానీ మట్టి గాజులకే అపూర్వ గౌరవం లభిస్తుంది.

అలంకారమే కాదు.. ఆరోగ్యమూ,,,

ఆడ పిల్లలచేతికి గాజులు ఖచ్చితంగా ఉండాలని పెద్దలు హుకూం జారీ చేస్తుంటారు. ఇది కేవలం సంప్రదాయం కాదు. కేవలం అందం కోసం అంతకంటే కాదు. ఆరోగ్య పరిరక్షణకూ గాజులే కీలకం. మహిళల చేతులకు గాజులు వల్ల మణికట్టు ప్రాంతంలో రక్త ప్రసరణలో ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ముఖ్యంగా గర్భిణీలు ఎక్కువ గాజులు ధరించాలంటారు. అందుకే దక్షిణ భారతదేశంలో స్త్రీ గర్భవతి కాగా.. పుట్టింటి కుటుంబం తమ బిడ్డ ‘శ్రీమంతం’లో ఒకచేతికి 21 గాజులు, మరోచేతికి 22 గాజులు తొడుగుతారు. ఎందుకంటే చేతులకు గాజులతో రక్త ప్రసరణలో గాజుల శబ్దం కూడా భాగం పంచుకుంటుంది. కడుపులో బిడ్డ కూడా.. ఆ గాజుల గల గలకు చిందులేస్తుంది. ఆరోగ్యంగా ఉంటుంది. హార్మోన్ల అసమతుల్యత నుంచి ఉపశమనం లభిస్తుంది. అంతే కాదు గర్భిణీల్లో ఒత్తిడి,అలసట, నొప్పులుతట్టుకునే సామర్థ్యంపెరుగుతుంది.శరీరంలోని అధిక వేడిని మట్టి గాజులు తగ్గించేందుకు సహాయ పడతాయి. వాతావరణం నుంచి స్వచ్ఛతను మట్టి గాజులు గ్రహిస్తాయి. గాజులు ధరించిన ప్రతి మహిళకు సహజ వాతావరణంలో శక్తిని ఇస్తుంది.

గాజులోళ్లు మాయమయ్యే..

- Advertisement -

చేతికి గాజులులేని ముత్తైదువను ఊహించగలమా? . చేతికి గాజులే గౌరవం. ముతైదువలోని ఐదు లక్షణాలలో గాజులు తప్పనిసరి. ఎక్కడ తిరునాల జరిగిన.. జాతర పోటెత్తిన అక్కడ గాజుల దుఖాణాల సందడి కనిపించాల్సిందే. గాజుల సవ్వడి వినాల్సిందే. ఒకప్పుడు గాజులమ్మే గాజులోళ్లు ఎప్పుడు వస్తారా? అని ఊళ్లోని మహిళలు ఎదురు చూసేశారు. ఈ గాజులోళ్లు ఊరూర తిరుగుతూ, ఇంటింటికి వెళ్లి అక్కలు, చెల్లెమ్మల చేతికి గాజులు వేసేవారు. ఆ రోజుల్లో ఏ ఇంటిలోశుభకార్యం జరిగినా గాజులోళ్ళను పిలిపించుకుని, ఇంటిళ్ళిపాది ఆడోళ్లకు గాజులు వేయించుకుని, నమస్కరించి, తగిన రీతిలో సంభావన సమర్పించేవారు. ఆధునిక కాలంలో చోటు చేసుకున్న పెను మార్పులతో ఊరూర తిరిగే గాజులోళ్లు కనుమరుగైనా.. అతివల గాజుల వాడకంతగ్గలేదు. మారలేదు. ఫ్యాన్సీ దుఖాణాలు వచ్చాయి. ఒకటి రెండు గాజుల ఫ్యాషనొచ్చింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement