Saturday, September 21, 2024

Summer Special | వేసవిలో మరిన్ని ప్రత్యేక రైళ్లు..

రైల్వే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త అందించింది. వేసవి రద్దీ దృష్ట్యా ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు వెల్ల‌డించింది. సికింద్రాబాద్ – సంత్రగాచి – సికింద్రాబాద్ మధ్య ప్రత్యేక రైళ్లు నడిపించినున్నట్లు ప్రకటించింది. సికింద్రాబాద్ – సంత్రగాచి (07243) మధ్య జూన్ 30 వరకూ ప్రతి ఆదివారం, అలాగే, సంత్రగాచి – సికింద్రాబాద్ (07235) మధ్య జులై 2 వరకూ ప్రతి మంగళవారం ప్రత్యేక రైళ్లు అందుబాటులో ఉంటాయని వెల్లడించింది.

పలు ప్రత్యేక రైళ్ల పొడిగింపు..

వేసవి రద్దీ దృష్ట్యా ప‌లు ప్రత్యేక రైళ్లను పొడిగించినట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. సికింద్రాబాద్ – రామాంతపూర్ (07695) జూన్ 26 వరకూ, రామాంతపూర్ – సికింద్రాబాద్ (07696) జూన్ 28 వరకు పొడిగించినట్లు అధికారులు తెలిపారు. అలాగే, సికింద్రాబాద్ – దిబ్రుఘర్ (07046) జూన్ 24 వరకూ, దిబ్రుఘర్ – సికింద్రాబాద్ (07047) జూన్ 27 వరకూ పొడిగించినట్లు వెల్ల‌డించారు. ప్రయాణికులు ఈ సర్వీసులను వినియోగించుకోవాలని సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement