Sunday, November 3, 2024

AP-TS: రేప‌టి నుంచి స్కూళ్ల‌కు వేస‌వి సెల‌వులు..

తెలంగాణ‌, ఏపీలోనూ బ‌డుల‌కు తాళం
ఏకంగా ఈసారి 50 రోజులు హాలీడేస్
ఇత‌ర ప్రాంతాల‌కు వెళ్లేందుకు పేరేంట్స్ ప్లాన్

హైద‌రాబాద్ / అమ‌రావ‌తి – ఏపీ, తెలంగాణలో రేపటి నుంచి అంటే ఏప్రిల్ 24 నుంచి వేసవి సెలవులు ప్రారంభం కానున్నాయి. దీంతో వేసవి సెలవులను హాయిగా ఎంజాయ్ చేసేందుకు విద్యార్థులు సిద్ధమవుతున్నారు. రేపటి నుంచి 50 రోజుల పాటు ఎంజాయ్ చేసేందుకు ప్లాన్ వేసుకున్నారు. తెలంగాణలో మార్చి 15 నుంచి హాఫ్ డే స్కూల్స్ ప్రారంభం కాగా నేటితో ముగిసాయి.

దీంతో ఏపీ, తెలంగాణ‌లోని అన్ని పాఠశాలలు రేపటి నుంచి జూన్ 11వరకు వేసవి సెలవులను ప్రభుత్వం ప్రకటించింది. సమ్మేటివ్ అసెస్‌మెంట్-2 పరీక్షలు నిన్న అంటే సోమవారంతో ముగిసాయి. పేరెంట్స్ మీటింగ్ నిర్వహించి ఆన్ లైన్ ప్రోగ్రెస్ కార్డులు ఇవాళ‌ అంద‌జేశారు.. జూన్ 11వరకు విద్యార్థులకు దాదాపు 50రోజుల పాటు వేసవి సెలవులు ఉండనున్నాయి. ఆ తర్వాత జూన్ 12 నుంచి ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు పునఃప్రారంభమవుతాయి. ఈ మేరకు అధికారులు ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేశారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement