అమరావతి, ఆంధ్రప్రభ: ప్రచండ భానుడు నిప్పులు చెరి గాడు. వడగాల్పుల ధాటికి జనం అల్లాడిపోయారు. బయటకు వెళ్లలేక, ఇంట్లో ఉండలేక యాతన పడుతున్నారు. రోహిణి కార్తె రాకముండే రోళ్లు బద్దలయ్యే విధంగా భానుడు భగభగమంటున్నారు… ఎపిలోని అన్నిజిల్లలోనూ ఏకంగా 45 నుంచి 47 ఢిగ్రీల ఉష్ణోగ్రతలు సోమవారం నాడు నమోదయ్యాయి.. . ఉదయం 8 గంటల నుంచే మొదలైన ఎండ తీవ్రత రాత్రి 9 అయినా వడగాల్పులు తీవ్రత తగ్గడం లేదు . సోమవారం నాడు విజయనగరం, మన్యం, అల్లూరి, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ,ఉభయగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 45 నుంచి 47డిగ్రీల సెంటీగ్రేడ్ ఈల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
కర్నూలు, నంద్యాల, వైఎస్‌ఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 43 నుంచి 45డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు పెరిగాయి. 127 మండలాల్లో తీవ్రవడగాల్పు లు, 173 మండలాల్లో వడగాల్పులు, అల్లూరి జిల్లా 2, అనకాపల్లి 8, బాపట్ల 9, తూర్పుగోదావరి 17, ఏలూరు 3, గుంటూరు 13, కాకినాడ 18, కోనసీమ 15, కృష్ణా 18, ఎన్టీఆర్ 8, పల్నాడు 2, మన్యం 1, విశాఖ 3, పశ్చిమగోదావరి జిల్లాలోని 13 మండలా ల్లో తీవ్రవడగాల్పులు, మరో 173 మండలాల్లో వడగాల్పులు ప్రభావం చూపాయి. మరో అయిదు రోజుల పాటు వడగాల్పులతో ఎండలు మందే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ప్రజలు ఎండ తీవ్రత పట్ల అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా వృద్ధులు, గర్భిణీలు, బాలింతలు తగిన జాగ్రత్తలు తీసు కోవాలని విపత్తు నిర్వహణ సంస్థ ఎండీ బీఆర్ అంబేద్కర్ సూచించారు. విపత్తు నిర్వహణ సంస్థ నుంచి ప్రజలకు అలర్ట్ సందేశాలు పంపుతున్నట్లు చెప్పారు. పగటి పూట 10 దాటిన తర్వాత అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని ప్రజలకు సూచించారు.