ఏపీలో ఎండలు మండిపోతున్నాయి. యాస్ తుఫాన్ ప్రభావంతో రెండు రోజులు వాతావరణం కాస్త చల్లబడినా… మళ్లీ వాతావరణం వేడెక్కింది. వచ్చే నాలుగు రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశమున్నట్లు రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ ప్రకటించింది. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, అత్యవసరం అయితే తప్ప ఇంట్లో నుంచి బయటకు రావొద్దని సూచించింది. ఇవాళ రేపు తూర్పుగోదావరి జిల్లాలో 12, విజయనగరం జిల్లాలో 2 మండలాల్లో తీవ్ర వడగాలులు వీస్తాయని విపత్తు నిర్వహణ శాఖ తెలిపింది. పశ్చిమగోదావరి జిల్లాలో 36, కృష్ణాలో 15 మండలాలు మిగిలిన చోట్ల.. మొత్తం 68 మండలాల్లో వడగాలుల తీవ్రత ఉంటుందన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement