Saturday, November 23, 2024

తాటి ముంజలు వ‌చ్చేశాయి …. చ‌ల్ల‌ద‌నాన్ని తెచ్చేశాయి..

తాడేపల్లి,ఏప్రిల్22(ప్రభ న్యూస్ ) – వేసవి వచ్చిందంటే చాలు మనకు ముందుగా గుర్తుకు వచ్చేది తాటి ముంజలు, చెరుకురసం,ఈతకాయలు. వేసవిలో వీటికి ఉన్న ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. ఏడాదికి ఒక్కసారైనా తినాల్సిందే. వేసవి నుంచి ఉపశమనం ఇస్తూ.. మరో పక్క మండే ఎండలకు చలువను కూడా ఇస్తుంది. అంత ప్రాధాన్యత ఉన్న వీటిని ఎవరు మాత్రం తినకుండా ఉంటారు. మండే ఎండల్లో తాటి ముంజలు తింటే ఆరోగ్యానికి మేలు చేస్తాయనే నమ్మకం ఉండనే ఉంది. వేసవి దాహాన్ని తీర్చుతాయి. వీటిని ఐస్‌ యాపిల్స్‌ అని కూడా పిలుస్తుంటారు. తాటి ముంజలు అని, ముంజకాయలు అని వివిధ రకాల పేర్లతో పిలుస్తారు. వేసవిలో లభించే అరుదుగా లభించే తాటి ముంజలు ఒకటిగా గుర్తింపు పొందింది. గిరాకీ కూడా తక్కువగా ఉండటంతో వీటి అమ్మకం కూడా ఎక్కువ రేట్లతో ఉంటుంది.

పోషకాల బాండాగారం
పోషకాల బాంఢాగారమని వీటికి పేరు. ఇవి కల్తీలేని స్వచ్ఛమైన ప్రకృతిని లభించేవి. శరీరానికి ఎంతో చల్లదనాన్ని ఇస్తోంది. ఇలాంటి పండ్లనే ప్రజలు ఎక్కువగా కోరుకుంటారు. ఇవి ఆరోగ్యాన్ని కూడా కలిగిస్తాయి. ఇవి లీచీ పండ్లను పోలి ఉంటాయి. పట్టుకుంటే జారిపోయే జెల్లీలాగా తాటిముంజలు ఉంటాయి. వీటి లోపలి భాగంగాలో నీరు తియ్యగా ఉంటుంది. ఎక్కువగా నీటి శాతాన్ని కలిగి ఉంటుంది. తద్వారా కడుపు నిండినట్లుగా ఉంటుంది. శరీర బరువు కూడా సులభంగా తగ్గుతుంది.

తాటిముంజల్లో విటమిన్లు మెండు
తాటి ముంజుల్లో విటమిన్‌ ఏ, బీ, సీ, కే, జింక, ఐరన్‌, పోటాష్‌ అత్యధికంగా ఉంటాయి. శరీరంలో చక్కెర శాతాన్ని సమ తుల్యం చేస్తాయి. తక్కువ మొత్తంలో క్యాలరీలు, ఎక్కువ మొత్తంలో ప్రొటీన్లు ఉంటాయి. వీటి వల్ల గ్యాస్‌, ఎసిడిటీ, ఉబ్బరంగా ఉండటం, ఉదర సంబంధిత సమస్యలను తగ్గిస్తాయి. ఊళ్లలో రోడ్లకు ఇరువైపులా ఉండే తాటి చెట్లు ఆకాశాన్ని తాకుతున్నట్లుగా కనిపిస్తాయి. ఇవి ప్రభుత్వ ఆధీనంలో ఉండగా వాటిని కల్లు, గీత కార్మికులు ఆ చెట్లను పాట రూపంలో పాడుకుని తమ సొంతం చేసుకుంటారు. అనంతరం వేసవిలో లభించే పండ్లతో మార్కెట్లలో ని గిరాకీ పరంగా వాటిని అమ్ముతుంటారు. వీరికి ఇదే జీవనాధారం కాగా కొంతమంది వీటితో పాటు మరో వ్యాపారం కూడా చేస్తుంటారు.

డజన్‌ ముంజలు రూ.70
ప్రస్తుతం వీటి ధర డజను రూ. 70గా పలుకుతుంది. ఈ దశాబ్దంలో ఇవే అత్యధికం. గత ఏడాది డజను రూ. 40 నుంచి రూ. 50 వరకు అమ్ముడుపోయాయి. బాగా రద్దీగా ఉండే ప్రదేశాలలో ఒక చోట తాటి ముంజులను తీసుకువచ్చి ఉంచుతారు. కేవలం గంటలోనే ఆటో ఖాళీ అయిపోతుందంటే అతిశయోక్తి కాదేవెూ. ప్రభుత్వం ఇటీవల చెట్టుపై తీసుకునే ఛార్జీలను కూడా ఎత్తివేసింది. దీనివల్ల కార్మికులకు కొంత ఊరట లభించినట్లయింది. తాటి ముంజులే కాకుండా కల్లు, తాటి కాయలు కూడా ఈ చెట్ల నుంచే వస్తాయి. వీటిని తింటే చాలా రకాల సమస్యలు తొలుగుతాయని, ఆరోగ్యంగా ఉంటారని , వేడిమి నుంచి తట్టుకోవచ్చని వైద్యులు చెబుతున్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement