Saturday, November 23, 2024

విశాఖలో సల్ఫ్యూరిక్ ప్లాంట్.. దేశంలోనే రెండో అతిపెద్దది..

ప్ర‌భ‌న్యూస్: దేశంలోనే రెండో అతిపెద్ద ఫాస్పేటిక్‌ ఎరువుల ఉత్పత్తి సంస్థ కోరమాండల్‌.. విశాఖపట్నంలో నూతన సల్ఫ్యూరిక్‌ యాసిడ్‌ ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తున్నది. మోన్‌షాంటో ఎన్విరో-కెమ్‌ సిస్టమ్స్‌ (ఎంఈసీఎస్‌), థైసెన్కూప్‌ ఇండస్ట్రియల్‌ సొల్యూషన్స్‌ (టీకేఐఎస్‌) సాంకేతిక సహకారంతో.. రూ.400 కోట్ల పెట్టుబడితో ఈ ప్లాంట్‌ను నిర్మించబోతోంది. ఈ సందర్భంగా కోరమాండల్‌ ఇంటర్నేషనల్‌ లి మిటెడ్‌ ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ చైర్మన్‌ అరుణ్‌ అలగప్పన్‌ మాట్లాడుతూ.. భారతదేశ నికర సల్ఫ్యూరిక్‌ యాసిడ్‌ దిగుమతిదారు.. ప్రపంచ వ్యాప్తంగా 3వ అతిపెద్ద దిగు మతిదారు.. దాదాపు 20 లక్షల మెట్రిక్‌ టన్నుల సల్ఫ్యూరిక్‌ యాసిడ్‌ దిగుమతులు అవుతాయన్నారు.

ఆత్మనిర్భర్‌ భారత్‌ కార్యక్రమానికి అనుగుణంగా దిగుమతి ప్రత్యామ్నాయం, స్థానిక తయారీని ప్రోత్స హించడానికి కోరమాండల్‌ విశాఖపట్నంలో కొత్త 1650 టీపీడీ సల్ఫ్యూరిక్‌ యాసిడ్‌ ప్లాంట్‌ ఏర్పాటును ప్రకటించారు. ఈ సందర్భంగా ఎంఈ సీఎస్‌, టీకేఐఎస్‌ ప్రతినిధుల బృందానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ ప్రాజెక్టు ఎంతో కీలకమైందని, దేశంలోకి సల్ఫ్యూరిక్‌ యాసిడ్‌ దిగుమతులను తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుందన్నారు. 1966లో ఎరువుల తయారీ ప్రారంభించిన ప్పటి నుంచి కోరమాండల్‌ ఇంటర్నేషనల్‌ నేడు భారత్‌లో అతిపెద్ద ప్రైవేట్‌ ఫాస్పేటిక్‌ ఎరువుల తయారీ, విక్రయదారు, రైతులకు నమ్మకమైన భాగస్వామిగా ఎదిగిందని తెలిపారు.

కఠినమైన పర్యావరణ ఉత్పత్తి లక్ష్యాలను చేరుకోవడానికి ప్రాజెక్టు కోసం అవసరమైన కచ్చితమైన పనితీరు, ఉద్గారాల నియంత్రణకు హామీ ఇవ్వడానికి కోరమాండల్‌ సిద్ధంగా ఉందని ఎంఈసీఎస్‌ యూఎస్‌ఏ గ్లోబల్‌ లైసెనింగ్‌ మేనే జర్‌ బ్రియాన్‌ బ్లెర్‌ తెలిపారు. ఫాస్పోటిక్‌ఎరువు విభాగంలో అత్యంత ఉన్నతమైన కస్టమర్లలో కోరమాండల్‌ ఒకటిగా ఉందని టీకేఐఎస్‌ ఇండియా ఎండీ రాజేశ్‌ కామత్‌ తెలిపారు. కోరమాండల్‌ వారి ఎన్నూరు ఎరువుల కర్మాగారంలో అమోనియా ట్యాంక్‌ టెర్మినల్‌ ఏర్పాటు చేసిన 1990 నుంచి వారితో అనుబంధం కొనసాగుతూ ఉందన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. రియల్ టైమ్ న్యూస్ అప్ డేట్స్ కోసం.. ప్రభన్యూస్ ఫేస్‌బుక్‌, ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి
https://twitter.com/AndhraPrabhaApp, https://www.facebook.com/andhraprabhanewsdaily

Advertisement

తాజా వార్తలు

Advertisement