Thursday, November 21, 2024

Nandyal District: సీఎం జగన్ కు థాంక్యూ : పాలాభిషేకం చేసిన విద్యార్థులు

నంద్యాలను జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేసినందుకు సీఎం జగన్ కు స్థానిక విద్యార్థి సంఘాలు ధన్యవాదాలు తెలిపాయి. థాంక్యూ సీఎం సార్ అంటూ ర్యాలీ నిర్వహించారు. నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి విజ్ఞప్తి మేరకు నంద్యాల జిల్లాగా ఏర్పాటు చేసినందుకు విద్యార్థి సంఘాలు,  వైయస్ఆర్సీపీ యువజన విభాగం ఆధ్వర్యంలో భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించి సీం జగన్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఎన్నో సంవత్సరాలుగా నంద్యాల ప్రజల చిరకాల వాంఛను రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి నెరవేర్చినందుకు వారికి నంద్యాల ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

ఈ సందర్భంగా వైసీపీ విద్యార్థి విభాగం నాయకులు మాట్లాడుతూ.. నంద్యాల పార్లమెంట్ ను ఎన్నో దశాబ్దాలుగా జిల్లా కావాలని కలగా మిగిలిపోయిందన్నారు. మొట్టమొదటిసారిగా సీఎం జగన్ ఆంధ్రప్రదేశ్లో 13 జిల్లాలను 26 జిల్లాలుగా చేసి చరిత్రలో నిలిచి పోయారన్నారు. గతంలో చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీని ఎన్టీరామారావు నుండి లాగేసుకుని ఒక్క రోజు కూడా ఎన్టీ రామారావు పేరు పెట్టాలన్న ఆలోచన కూడా చేయలేదని విమర్శించారు. ప్రజలు కూడా చంద్రబాబును నమ్మే పరిస్థితిలో లేరన్నారు. ఎలక్షన్ సమయంలో మాత్రం ఎన్టీ రామారావు పేరును వాడుకుంటున్నారని విమర్శించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర సమయంలో ఇచ్చిన మాట ప్రకారం ఎన్టీఆర్ పేరును జిల్లాగా ప్రకటించి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారని గుర్తు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement