Sunday, November 24, 2024

AP | పరీక్షల్లో ఫెయిల్​ అయితే.. ప్రాణాలు తీసుకోవాలా?

ఏపీలో విద్యార్థులు మానసిక స్థైర్యం కోల్పోయి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇంటర్​ రిజల్ట్స్​ విడుదల కావడం, కొన్ని సబ్జెక్టుల్లో ఫెయిల్​ అయ్యామనే మనస్తాపంతో ఇలాంటి అఘాయిత్యానికి ఒడిగడుతున్నట్టు తెలుస్తోంది. కొంతమంది విద్యార్థులు ప్రాణాలు తీసుకోవడమే దీనికి పరిష్కార మార్గం అనుకుని వారి కుటుంబంలో విషాదం నింపుతున్నారు. ఈ ఒక్క పరీక్ష తప్పితే జీవితం మొత్తం ఓడిపోయినట్టు కాదని మానసిక వైద్య నిపుణులు చెబుతున్నారు. ఓటమి అనేది గెలుపునకు పునాదిగా ఉండాలని, చదువు అనేది విద్యార్థుల్లో మానసిక స్థైర్యాన్ని నింపాలని చెబుతున్నారు. అంతేకాని, చిన్న చిన్న విషయాలకు మనస్తాపం చెంది ప్రాణాలు తీసుకోవద్దని చెబుతున్నారు.

విషాదం నింపిన ఇంటర్​ ఫలితాలు..

ఆంధ్రప్రదేశ్​లో ఇంటర్మీడియట్‌ ఫలితాలు విషాదాన్ని మిగిల్చాయి. పరీక్షల్లో ఫెయిల్​ అయ్యామనే ఆవేదనతో కొంతమంది విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఏడాది మార్చి 15 నుంచి ఏప్రిల్ 4వ తేదీ వరకు జరిగిన ఇంటర్​ పరీక్షలకు మొత్తం 10,03,990 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఈ పరీక్షలకు సంబంధించిన ఫలితాలను ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ బుధవారం రాత్రి వెల్లడించారు.

ఇక.. ఇంటర్‌ ఫస్టియర్‌లో 61 శాతం, సెకండ్‌ ఇయర్‌లో 72 శాతం మంది విద్యార్థులు పాస్​ అయ్యారు. అయితే.. ఫెయిలైన వారిలో కొంతమంది స్టూడెంట్స్​ మనస్తాపానికి గురయ్యారు. దీంతో ఆత్మహత్యకు పాల్పడ్డట్టు తెలుస్తోంది. కాగా, గురువారం ఉదయం నుంచి శుక్రవారం సాయంత్రం వరకు ఏపీలో మొత్తం 9 మంది ఇంటర్‌ విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తోంది.

- Advertisement -

డిగ్రీలో ఫెయిల్​ అయ్యాననే మనస్తాపంతో మరో విద్యార్థిని..
ముత్తుకూరు: నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలంలో విషాదం నెలకొంది. డమ్మాయపాలెం పరిధి, పోతునాయుడుదిబ్బ గ్రామానికి చెందిన నిహారిక (20) శుక్రవారం ఆత్మహత్య చేసుకుంది. మృతురాలు తమ ఇంట్లో సీలింగ్ ఫ్యాన్‌కు చీరతో ఉరేసుకుని చనిపోయిందని ఎస్సై శివ కృష్ణారెడ్డి తెలిపారు. నిహారిక నెల్లూరు వివేకానంద డిగ్రీ కాలేజీలో ద్వితీయ సంవత్సరం చదువుతోంది. ఒక సబ్జెక్టులో ఫెయిల్ అవడంతో మనస్తాపానికి గురయ్యింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement