Wednesday, December 4, 2024

AP | బడికి వెళ్లమంటే.. విద్యార్థి ఆత్మహత్య

కర్నూలు బ్యూరో : తల్లిదండ్రులు మందలించారని విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం యల్.బండ గ్రామంలో చోటు చేసుకుంది. ఎల్ బండ గ్రామం చెందిన శేఖర్ అనే వ్యక్తి కుమారుడు ఎల్లకృష్ణ (12) స్థానికంగా ప్రభుత్వ పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్నాడు.

అయితే గత 5రోజుల నుంచి స్కూలుకు విద్యార్థి వెళ్లకపోవడంతో తల్లిదండ్రులు మందలించారు. దీంతో మనస్థాపానికి గురైన ఎల్లకృష్ణ ఇవాళ‌ ఉదయం పురుగుమందు తాగాడు. ఇది గమనించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన బాలుడిని కర్నూలు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement