Thursday, December 5, 2024

Nandyala | స్కూల్ ప్రహరీ గోడ కూలి విద్యార్థి మృతి..

నంద్యాల బ్యూరో, డిసెంబర్ 4 : నంద్యాల జిల్లాలోని నందికొట్కూరు పట్టణంలోని ఉర్దూ పాఠశాల స్కూల్ ప్రహరీ గోడ కూలి విద్యార్థి మృతి చెందిన సంఘటన జరిగింది. ఉర్దూ పాఠశాలలో మూడో తరగతి చదువుతున్న విద్యార్థి మహిన్(8) గోడ కూలి అక్కడికక్కడే మృతి చెందింది.

ఉపాధ్యాయుల నిర్లక్ష్యంతోనే పాప మరణించిందని తల్లిదండ్రుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. బాలిక మృతిచెందిన సంఘటన స్థలాన్నినందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య పరిశీలించి, బాలిక కుటుంబాన్ని పరామర్శించారు. కుటుంబానికి న్యాయం చేస్తామని పేర్కొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement