Friday, November 22, 2024

దసరా సెలవుల్లో క్లాసులు నడిపితే కఠిన చర్యలు.. ఇంటర్‌ బోర్డ్‌ హెచ్చరిక

అమరావతి, ఆంధ్రప్రభ: ప్రయివేట్‌, అన్‌ ఎయిడెడ్‌ ఇంటర్మీడియట్‌ కాలేజీలు దసరా సెలవుల్లో విద్యార్ధులకు ఎటువంటి క్లాసులు నిర్వహించినా కఠిన చర్యలు తీసుకుంటామని ఇంటర్మీడియట్‌ బోర్డు హెచ్చరించింది. ఆ కాలేజీల గుర్తింపును రద్దు చేయడంతోపాటు ప్రిన్సిపాల్స్‌పై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని తెలిపింది.

ఈమేరకు ఆదివారం ఇంటర్మీడియట్‌ బోర్డు ఓ ప్రకటనను విడుదల చేసింది. ఈమేరకు ప్రాంతీయ పర్యవేక్షక అధికారులు కాలేజీలను తనిఖీ చేయాలని ఆదేశించింది. ఈనెల రెండో తేదీ నుండి తొమ్మిదో తేదీ వరకు ఇంటర్‌ విద్యార్ధులకు రాష్ట్ర ప్రభుత్వం దసరా సెలవులు ప్రకటించిన సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement