Friday, November 22, 2024

బలపడుతున్న నైరుతి రుతుపవనాలు..

అమరావతి, ఆంధ్రప్రభ: రాగల 48 గంటల్లో మధ్య అరేబియా సముద్రంలోని మరికొన్ని ప్రాంతాలు, గోవా, దక్షిణ మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాలు, కర్ణాటకలోని మరికొన్ని ప్రాంతాలు, తమిళనాడులోని మిగిలిన భాగాలు, దక్షిణ ఆంధ్రప్రదేశ్‌ లోని కొన్ని ప్రాంతాలు, పశ్చిమ మధ్య మరియు వాయువ్య బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాల్లో నైరుతి రుతుపవనాలు ముందుకు సాగడానికి అనుకూలంగా ఉన్నాయని వాతావరణశాఖ పేర్కొంది. ఆ తరువాత రెండు రోజుల్లో మహారాష్ట్రలోని మరిన్ని ప్రాంతాలు, మొత్తం కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌ లోని మరిన్ని ప్రాంతాలు మరియు పశ్చిమ మధ్య మరియు వాయువ్య బంగాళాఖాతంలోని మరిన్ని ప్రాంతాలకు రుతుపవనాలు మరింత ముందుకు సాగడానికి పరిస్థితులు అనుకూలంగా ఉంటాయన్నారు.

తాజా పరిస్థితుల నేపథ్యంలో రానున్న రెండు రోజులు ఉత్తర కోస్తా, ఆంధ్రా మరియు యానం, దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లు లు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉందని, మెరుపులు, ఉరుములతో పాటు ఈదురు గాలులు గంటకు 30-40 కిలోమీటర్స్‌ వేగంతో వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement