విజయవాడ – బిజెపి, టిడిపి,జనసేనలు కూటమిగా ఏర్పడి ఎన్నికలలో పోటీ చేసినట్లయితే మళ్లీ జగన్ కే అధికారపీఠం దక్కుతుందని సిపిఐ జాతీయ సహాయ కార్యదర్శి నారాయన భవిష్యవాణిని వినిపించారు.. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, బిజెపికి ఒక్క మైనార్జీ వర్గం ఓట్లతో పాటు, దళితులు ఓట్లు కూడా పడవని, ఆ ఓట్లన్ని జగన్ పార్టీకే గంపగుత్తగా వేస్తారని చెప్పారు.. బిజెపి కి ఉన్న మైనార్టీ,దళిత వ్యతిరేకత వల్ల పూర్తి గా నష్టపోయేది టిడిపి, జనసేనలేనని అన్నారు.. బిజెపి నుంచి విడిపోయి టిడిపి, జనసేనలు రెండు పార్టీలు కలసి పోటీ చేస్తే అతిసునాయాసంగా అధికారం హస్తగతం చేసుకుంటాయని చెప్పారు.. బిజెపికి మైనార్టీలలో ఎంత వ్యతిరేకత ఉందో కర్నాటక ఎన్నికలలోనే తేలిపోయిందన్నారు.. ఆ వర్గం ఓట్లతోనే కర్ణాటకలో బీజేపీని కాంగ్రెస్ పార్టీ చిత్తు చిత్తుగా ఓడించిందని సీపీఐ నారాయణ పేర్కొన్నారు. గెలుపు ఇతర రాష్ట్రాలలో ప్రభావం చూపుతోందన్నారు. దేశ ఐక్యత కోసం కాంగ్రెస్ పార్టీలో ఇందిరా గాంధీ పనిచేశారన్నారు. ఆ కుటుంబంపై మోడీ కక్ష సాధిస్తున్నారన్నారు. రూ. 2 వేల నోట్లు ఉపసంహరణ వెనకాల దురుద్దేశం ఉందని పేర్కొన్నారు.
ఇంకా ఆయన మాట్లాడుతూ.. ‘‘రూ. 2 వేలు నోట్లను ఉపసంహరించి దొంగలను దొరలుగా చేశారు. ఎందుకు నోట్లు మార్చుకునేందుకు 4 నెలలు సమయం ఇచ్చారు? నోట్ల కట్టలు బీరువాలో దాచుకున్నవారు దర్జాగా పర్సంటేజ్ కి మార్చుకుంటారు. అలా వచ్చిన డబ్బుని బీజేపీ ఎన్నికలలో ఖర్చు చెయ్యబోతోంది. మోడీకి అభివృద్ధిపై ఫోకస్ లేదు… అవినీతిపై ఆయన ఫోకస్ ఉంది. మోడీ అసలైన ఆర్ధిక నేరస్తుడు. దేశంలో పొలిటికల్ పొలరైజేషన్ వచ్చింది. మోడీనీ దించడానికి అన్ని రాజకీయ పక్షాలు ఏకం అవుతున్నాయి. ఏపీకి జగన్ కన్న మోడీ ఎక్కువ ద్రోహం చేశాడు. జగన్ రాజకీయ దత్త పుత్రుడు. మోడీ కాళ్ళ దగ్గర జగన్ ఉన్నాడు’’ అని పేర్కొన్నారు.