Friday, November 22, 2024

AP | వెలుగోడులో వింత జంతువు కలకలం.. బంధించిన ఫారెస్ట్ ఆఫీస‌ర్లు

వెలుగోడు, (ప్రభన్యూస్) : నంద్యాల జిల్లా వెలుగోడు పట్టణంలోని ఎస్సీ కాలనీలో ఇవ్వాల (బుధవారం) తెల్లవారుజామున ఓ వింతజంతువు క‌నిపించింది. దీన్ని చూసిన స్థానికులు ఆందోళ‌న‌కు గుర‌య్యారు. భ‌యంతో వారు ఆ జంతుకు సమాచారాన్ని అటవీశాఖ అధికారులకు అందించారు. వెలుగోడు అటవీ అధికారి మహబూబ్ అలీ ఖాన్ త‌న పై అధికారులకు తెలియజేసి, ఫారెస్ట్ ఆఫీస‌ర్ శివనాగయ్య, బీట్ ఆఫీసర్ ఈరన్న సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో కుక్కరు మొరిగిన శబ్దం వచ్చినట్లు కాలనీవాసులు అటవీ అధికారులకు తెలియజేశారు.

కాగా, ఈ వింత జంతువు ఓ మామిడి చెట్టు కొమ్మల్లో దాగి ఉండడంతో ఆత్మకూరు నుండి వచ్చిన వైద్య బృందం ఆ జంతువుకు మత్తు ఇవ్వడానికి రెండు సార్లు ప్రయత్నించినా వీలు కాలేదు. మూడో ప్రయత్నంలో మత్తు ఇంజెక్ష‌న్‌ ఇచ్చినప్పటికీ ఆ జంతువుకు మత్తు రాక‌పోవ‌డంతో అటవీ అధికారులు సమయస్ఫూర్తితో చెట్టు దిగి పారిపోతున్న ఆ జంతువును బంధించారు .

ఇక గ్రామ‌స్తులు భ‌య‌ప‌డ్డ‌ట్టు ఏమీ లేద‌ని, ఆ జంతువు పేరుని ఫామ్ సెవేట్‌గాఆ అటవీ అధికారులు గుర్తించారు. అనంతరం బంధించిన జంతువును ఆత్మకూరు అటవీ శాఖ ఆఫీసుకు తీసుకెళ్లారు. ఈ జంతువు వయసు 8 సంవత్సరాలు ఉంటుందని , పాములు, కప్పలు, కీటకాలను తిని జీవ‌నం సాగిస్తుంద‌న్నారు. విష‌పూరిత‌మైన ఈ జంతువు మానవులను కరిస్తే ప్ర‌మాద‌మేన‌ని చెప్పారు. వైద్య పరీక్షల అనంతరం ఆరోగ్యంగా ఉంటే అటవీ ప్రాంతంలో వదిలి పెడ‌తామ‌ని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement