Monday, November 18, 2024

Story : ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కుకే కట్టుబడి ఉన్నాం.. మంత్రి బొత్స

శ్రీకాకుళం, ఆంధ్ర‌ప్ర‌భ : విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ విషయంలో మా పార్టీ, ప్రభుత్వం స్పష్టమైన వైఖరితో ఉందని జిల్లా ఇన్చార్జి.. మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. శ్రీకాకుళం ఆనందమయి ఫంక్షన్ హాల్లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. జగనన్నే మా భవిష్యుత్తు కార్యక్రమం విజయవంతమైన నేపథ్యంలో నిర్వహించిన మీడియా సమావేశానికి వైఎస్ఆర్ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్, శాసనసభాపతి తమ్మినేని సీతారాం, మంత్రులు ధర్మాన ప్రసాదరావు, సిదిరి అప్పలరాజు హాజరయ్యారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వద్దని కోరుతూ ఇప్పటికే సీఎం వైఎస్ జగన్ పలుమార్లు కేంద్రానికి నివేదించారని అన్నారు. పక్క రాష్ట్రం వాళ్లు హడావిడి చేయగానే కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ విషయంలో వెనక్కితగ్గిందంటూ అసత్య ప్రచారాలు చేయడంలో విపక్షాలకు విజ్ఞత ఏమైనా ఉందా? అని ప్రశ్నించారు. ప్రజలు అన్నీ గమనిస్తుంటారని ఎవరు తమకు మేలు చేస్తారో? ఎవరు కీడు చేస్తారో? వివేకంతో గ్రహించి ఎన్నికల్లో ఓట్లు వేస్తారని అందువల్లే గత ఎన్నికల్లో మీకు ఘోరపరాజయం తప్పులేదన్నారు. భావనపాడు పోర్టుని ఈ ప్రభుత్వం అదానికి అప్పగించేస్తోందని ఎల్లో మీడియాలో రాయిస్తున్న రాతలకు చంద్రబాబు ఆత్మ విమర్శ చేసుకోవాలన్నారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ పోర్ట్ గురించి ఎందుకు బాధ్యతగా ఆలోచించలేదని అన్నారు. నేరడి బ్యారేజ్ నిర్మాణం ఆలస్యం అవుతుందనే రైతులు. ప్రయోజనాలకోసం ఎత్తిపోతల పథకాన్ని ఏర్పాటు చేయిస్తుంటే దానిపై కూడా అవగాహన లేకుండా చంద్రబాబు మాట్లాడుతున్నారని అన్నారు. గత కొన్ని దశాబ్ధాలుగా కలతలతోనే అధికారాన్ని సాధించడానికి అలవాటు పడిపోయిన చంద్రబాబుకు రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమం కలవరపాటుకు గురిచేస్తున్నాయని అన్నారు.

వైఎస్ఆర్ఎసీపీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ మాట్లాడుతూ సీఎం జగనన్న పాలనపై ప్రజల్లో ఉన్న విశ్వాసం నిరుపమానమైనదని, అందువల్లే జగనన్న మా భవిష్యత్తు మెగా పీపుల్ సర్వే అప్రతిహతంగా కొనసాగుతోందని అన్నారు. ఈ కార్యక్రమం ప్రారంభమైన వారం రోజుల్లోనే విశేష ప్రజాదరణని సొంతం చేసుకుందని. అన్నారు. ఇలాంటి పీపుల్ సర్వే దేశంలోనే ఇంతవరకూ ఏ రాజకీయ పార్టీ, ప్రభుత్వం నిర్వహించలేదని అన్నారు. తమ ప్రభుత్వ పాలనపై ప్రజాభిప్రాయాన్ని సేకరించే మైన కార్యక్రమం ఒక్క వైఎస్ఆర్ సీపీ మాత్రమే చేస్తోందని కృష్ణ దాస్ అన్నారు.

- Advertisement -

అంతకుముందు పార్టీ ముఖ్యులతో ముఖ్యమంత్రి జిల్లా పర్యటనపై నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ ఈనెల 19న సీఎం వైఎస్ జగన్ ఈ జిల్లాలో రెండు బృహత్ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయడానికి వస్తున్నారని అన్నారు. సీఎం పర్యటనని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అభివృద్ధి లేదు లేదు అని పదే పదే వివక్షాల ప్రచారం చేస్తున్నాయని, దీనిని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రతి ఒక్కరూ తిప్పికొట్టాలని పిలుపు ఇచ్చారు. ఇవాళ మనం మాట్లాడడపోతే తప్పు చేసిన వారమవుతామని అన్నారు. ఇప్పటికి జిల్లాలో ఇచ్చాపురం మొదలుకుని రణ స్థలం వరకూ వివిధ రూపాల్లో అభివృద్ధి అడుగుతోందని అన్నాడు. ఇచ్ఛాపురంలో డయాలసిస్ యూనిట్ల ఏర్పాటు, పలాసలో ఢిర్నీ పరిశోధన కేంద్రం ఏర్పాటు, అలానే టెక్కలిలో ఆఫ్ షోర్ నాయక్ పనులు పూర్తికి నిధుల కేటాయింపు, పాడపట్నం పరిధిలో గాల్టా బ్యారేజ్ వద్ద నియోగించుకునేలా ఎత్తి పోతల పథకానికి రూపకల్పన చేసిన వైనం. ఇవన్నీ కూడా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని అన్నారు. అనేవి గతంలో లేవని కానీ జగన్ అధికారంలోకి వచ్చాక నాగావళితో పాటు వంశధార నీటిని సద్వినియోగం చేసుకోవాలన్న సదుద్దేశంలో సాగునీటి పనులకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారని అన్నారు. ముఖ్యమంత్రి రాక నేపథ్యంలో సంబంధిత షెడ్యూల్ ప్రకారం వివిధ అభివృద్ధి పనుల శంకుస్థాపనలకు పెద్ద ఎత్తున కార్యకర్తలు తరలి రావాలని కోరారు. ప్రాంతీయ అసమానతలు నివారిస్తూ ళ అభివృద్ధి పనులకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పారు.

మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు మాట్లాడుతూ మత్స్యకారుల చిరకాల స్వప్నం భావనపాడు పోర్టు అని, దానిని నెరవేర్చడానికి వస్తున్న సీఎం వైఎస్ జగన్ కు ఘనంగా స్వాగతం పలుకుదామని అన్నారు. గత ప్రభుత్వాలు ఈ జిల్లా ప్రజల ఓట్ల కోసం కమురుతో కాలక్షేపం చేస్తే సీఎం జగన్ మాత్రం తన ప్రణాళికలకు కార్యరూపాన్ని ఇస్తూ జిల్లాను ప్రగతిపథంలో నిల్పడానికి కృషి చేస్తున్నారని అన్నారు. భావనపాడు పోర్టు నిర్మాణంలో జిల్లా సమగ్ర అభివృద్ధి సాధ్యం అవతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. విష్ణల ఆరోపణలు కాని విష ప్రచారాన్ని కానీ, తిప్పి కొట్టాలని ఆయన పిలుపు నిచ్చారు. భావన పాదుతో పాటే వంశధార ఫేజ్ 2. కు ఆనుకుని గొట్టా బ్యారేజ్ వద్ద ఏర్పాటుచేయనున్న ఎత్తిపోతల పథకం ద్వారా ఉద్దానం వరకూ నీరు అందిస్తామని, ఉపరితల జలాలు అందించడం ద్వారా ఉద్ధానం వ్యాధిగ్రస్తులకు ఎంతో మేలు కలుగుతుందని చెప్పారు. ఈ సమావేశంలో స్పీకర్ తమ్మినేని సీతారాం, ఎంఎల్సీలు వస్తు రామారావు, దువ్వాడ శ్రీనివాస్, ఎమ్మెల్యే గొర్లే కిరణ్ కుమార్, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ పీరియా విజయ, పార్టీ పరిశీలకులు, పలు కార్పొరేషన్ చైర్మన్లు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement