ఇచ్ఛాపురం : తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో తహసీల్దార్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. తహసీల్దార్ ఎన్ వెంకట్రావు పర్యవేక్షణలో ఈ కంట్రోల్ రూమ్ నిర్వహిస్తున్నారు. రానున్న రెండు మూడు రోజుల్లో తుఫాను ప్రభావం వల్ల భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ముందస్తు చర్యలు చేపట్టినట్లు తహసీల్దార్ తెలిపారు.
అవసరమైతే తప్ప ఇంటి నుండి ఎవరూ బయటకు రావద్దని ప్రజలను కోరారు. అత్యవసర పరిస్థితుల తలెత్తితే 911 4115363 ఫోన్ నెంబర్ కు సంప్రదించాలని సూచించారు.
- Advertisement -