అమరావతి, ఆంధ్రప్రభ : కుప్పం నియోజకవర్గంలో గ్రానైట్ అక్రమ మైనింగ్ జరుగుతుందని, దీనికి అడ్డుకట్ట వేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విజ్ఞప్తి చేశారు. శుక్రవారం ఆయన ఈ మేరకు ఒక లేఖను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి రాశారు. చిత్తూరు జిల్లా శాంతిపురం మండలం మద్దనపల్లెలో సర్వే నెం. 104, 213లో అక్రమ మైనింగ్‌పై నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్ (ఎన్జీటీ) ఇచ్చిన ఆదేశాలను, లేఖతో పాటు జత చేశారు.
ఎన్జీటీ ఆదేశాలను తక్షణమే అమలు చేయాలని కోరారు. అక్రమ మైనింగ్‌ను ఎన్జీటీ నిర్థారించిందని, ఈ అక్రమాలకు పాల్పడుతున్న పేర్లు, వివరాలను ఎన్జీటీ తెలపాలని కోరిన అంశాలను కూడా చంద్రబాబు ప్రస్తావించారు. అక్రమ మైనింగ్‌ను స్వయంగా పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని, ఈ అక్రమాలకు అడ్డుకట్ట వేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని చంద్రబాబు లేఖ ద్వారా కోరారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..