Friday, November 22, 2024

AP: ఏపీలోనూ పీచుమిఠాయి నిషేధానికి అడుగులు…

అమ‌రావ‌తి – ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. పీచు మిఠాయి అమ్మకాలపై ఫోకస్ పెట్టింది.. సాధారణంగా చిన్న పిల్లలు తినే పీచు మిఠాయి ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందా.. వీటిని తినడం వల్ల దుష్ప్రభావాలు కలుగుతాయా అంటే.. అవుననే సమాధానం వినిపిస్తోంది.

దీంతో గత వారం తమిళనాడు, పుదుచ్చేరిలో పీచు మిఠాయి అమ్మకాలపై విధించిన నిషేధం ఆంధ్రప్రదేశ్ లోనూ ప్రమాద హెచ్చరికలను మోగించింది. దీనిపై ప్ర‌భుత్వం స్పందించి శాంపిల్స్ సేకరించి పరీక్షలకు పంపాలని ప్రభుత్వం అన్ని జిల్లాల అధికారులను ఆదేశించింది. సేకరించిన శాంపిళ్లను టెస్టింగ్ కోసం అధికారులు పంపనున్నారు. ప్ర‌భుత్వ ఆదేశాల‌తో నేటి నుంచి శాంపిల్స్ ను ఫుడ్ సేఫ్టీ అధికారులు సేక‌రించ‌నున్నారు. ల్యాబ్ టెస్టింగ్ ఆధారంగా ఏపీలో పీచు మిఠాయిపై నిషేధంపై నిర్ణయం తీసుకోనుంది ప్రభుత్వం.

Advertisement

తాజా వార్తలు

Advertisement