Friday, November 22, 2024

రికార్డు లెవల్లో ఉక్కు ట‌ర్నోవ‌ర్.. క‌రోనా కాలంలోనూ త‌గ్గ‌ని జోరు..

విశాఖపట్నం, ప్రభన్యూస్‌ : కరోనా కష్టకాలంలో సైతం విశాఖ ఉక్కు (ఆర్‌ఐఎన్‌ఎల్‌) వేల కోట్లు టర్నో వర్‌ సాధించి రికార్డులు దిశగా పరుగులు తీస్తుంది. ప్రస్తుత ఏడాదికి సంబంధించి (కేవలం పది నెలలు) ఇప్పటి వరకు రూ.22,228 కోట్ల టర్నోవర్‌ను సాధించింది. స్టీల్‌ చరిత్రలో ఇంత పెద్ద మొత్తంలో టర్నోవర్‌ సాధించడం ఇదే ప్రధమం. గత ఏడాది రూ.20,844 కోట్ల టర్నోవర్‌ను సాధించిన విశాఖ స్టీల్‌ప్లాంట్‌ తాజాగా ఆ రికార్డును బద్దలు చేసింది. ఇక జనవరి మాసాంతానికి సంబంధించి 5,38,986 మెట్రిక్‌ టన్నుల ఉత్పత్తులను సాధించి రూ.2871 కోట్ల విక్రయాలు జరిపింది. ఇది కూడా అతి పెద్ద విక్రయం కావడం గమనార్హం. ఇక ఎగుమతులకు సంబంధించి జనవరి వరకు పరిశీలన గావిస్తే రూ.4,838 కోట్ల టర్నోవర్‌గా సాధించింది. 47 శాతం వృద్ధిని సాధించినట్లుగా అధికారులు ప్రకటించారు.

అయితే ఇంత పెద్ద మొత్తంలో విశాఖఉక్కు టర్నోవర్‌ సాధించినప్పటికి కేంద్రం సదరు సంస్థను ప్రయివేటీకరణ చేయడానికి ఇప్పటికే నిర్ణయించుకుంది. అయితే విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు సొంత గనులు కేటాయించినట్లు అయితే మరింత లాభాల బాట పట్ట నుందని కార్మిక సంఘాలు పేర్కొంటున్నాయి. అంతేకాకుండా విశాఖ స్టీల్‌ను ప్రయివేటుపరం చేయవద్దని ఏడాది కాలంగా ఉద్యోగ , కార్మిక, ప్రజా సంఘాలు ఆందోళనలు నిర్వహిస్తున్నాయి. కాబట్టి ఇప్పటికైనా విశాఖ ఉక్కును ప్రయివేటీకర ణను విరమించుకోవాలని పలువురు కోరుతున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement