Friday, November 22, 2024

క‌డ‌ప‌లో స్టీల్ ప్లాంట్ – కీల‌క వ్యాఖ్య‌లు చేసిన మంత్రి బుగ్గ‌న‌

క‌డ‌ప‌లో స్టీల్ ప్లాంట్ పెట్టేందుకు ఆలోచించొచ్చనే విభజన చట్టంలో ఉందని చెప్పారు మంత్రి బుగ్గ‌న రాజేంద్ర‌నాథ్ రెడ్డి. రెండో రోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాగా…కడప ఉక్కకర్మాగారంపై అచ్చెన్న వేసిన ప్రశ్నపై చర్చ జరిగింది. ఈ నేపథ్యంలోనే.. కడప స్టీల్ ప్లాంట్ విషయంలో మంత్రి బుగ్గన కీలక వ్యాఖ్యలు చేశారు. స్టీల్ ప్లాంట్ విషయమై విభజన చట్టంలో ఏముందో సరిగా చూడండని… కడపలో స్టీల్ ప్లాంట్ కోసం ప్రయత్నం చెయ్యొచ్చని అని మాత్రమే చట్టంలో ఉందని వెల్లడించారు. కడప స్టీల్ ప్లాంట్ అంశమై విభజన చట్టంలో MAY BE అని మాత్రమే ఉంది SHALL అని లేదు… కోవిడ్ వల్ల ప్రపంచ వ్యాప్తంగా స్టీల్ ఇండస్ట్రీ బాగా దెబ్బతిన్నదని వివరించారు. కడప స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు భాగస్వామ్యం కోసం వెతుకుతున్నామన్నారు. స్టీల్ ప్లాంట్ ల్యాండ్ కి సంబందించి రూ. 37.50 కోట్లు పరిహరం చెల్లించామన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement