విజయనగరం : జిల్లా కేంద్రంలో నిర్మాణంలో ఉన్న ప్రభుత్వ వైద్య కళాశాల పనులను జిల్లాలో వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం.టి. కృష్ణబాబు సందర్శించారు. రాష్ట్రంలో ఈ ఏడాది ఐదు కొత్త మెడికల్ కళాశాలల్లో తరగతులు ప్రారంభం కానున్నట్టు తెలిపారు. ఇప్పటికే నాలుగు కళాశాలలకు అనుమతులు వచ్చాయని, మరో కళాశాలకు కూడా త్వరలో అనుమతులు వస్తాయన్నారు. ఒక్కో కళాశాలలో 150 సీట్ల వంతున ఐదు కళాశాలల్లో కలసి రాష్ట్రానికి ఈ ఏడాది కొత్తగా 150 మెడికల్ సీట్లు కేటాయింపు జరిగిందన్నారు. ఈ ఆగష్టు నుంచే ఈ కళాశాలలు ప్రారంభం కానుందన్నారు. వచ్చే ఏడాది మరో మూడు కళాశాలలు ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఒక్కో కళాశాలలో 722 మంది అధ్యాపకులు, సిబ్బందిని నియమిస్తున్నట్లు తెలిపారు. జూలై 15వ తేదీ నాటికి వైద్య కళాశాల భవనాలు సిద్ధం చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం, వైద్య కళాశాలకు అవసరమైన విద్యుత్ సరఫరా, నీటి సరఫరా వంటి అంశాలను సమీక్షించామన్నారు. ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటుతో ఈ ప్రాంత ప్రజలకు అత్యాధునిక వైద్య వసతులు అందుబాటులోకి వస్తాయన్నారు. పర్యటనలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి, వైద్య ఆరోగ్య మౌళిక సదుపాయాల సంస్థ ఎండి మురళీధర్ రెడ్డి, వైద్య విద్య డైరెక్టర్ వర ప్రసాద్, వైద్య కళాశాల ప్రిన్సిపాల్ తదితరులు ఉన్నారు.
వైద్య కళాశాలల ఏర్పాటుతో అందుబాటులోకి అత్యాధునిక వైద్య వసతులు : జిల్లా వైద్యాధికారి కృష్ణబాబు
Advertisement
తాజా వార్తలు
Advertisement