కర్నూల్ బ్యూరో : ఈనెల 9వ తేదీన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. 9న ఉదయం 11గంటలకు గన్నవరం విమానాశ్రయం నుండి బయలుదేరి ఉ.11:45 గం.లకు కర్నూలు విమానాశ్రయం చేరుకుంటారు. ఓర్వకల్లు విమానాశ్రయం నుంచి ఉ.11:50 గంటలకు హెలికాప్టర్ లో బయలుదేరి గణి సోలార్ పార్క్, పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టు సైట్ ను ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించి మ.12:30 గం.లకు అప్పర్ రిజర్వాయర్ దగ్గర ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ కు చేరుకుంటారు.
అప్పర్ రిజర్వాయర్ హెలిప్యాడ్ నుండి రోడ్డు మార్గాన బయలుదేరి మ.12:40 గం.లకు అప్పర్ ఇన్టేక్ వ్యూ పాయింట్ కు చేరుకుంటారు. మ.12:40గం.ల నుండి మ.1:15 గం.ల వరకు ప్రాజెక్ట్ ను పరిశీలించి, మ.1:15 గం.లకు అప్పర్ ఇన్టేక్ వ్యూ పాయింట్ నుండి రోడ్డుమార్గాన బయలుదేరి మ.1:25 గం.లకు పవర్ హౌస్ కు చేరుకుంటారు. అక్కడి నుంచి మ.1:40 గం.లకు రోడ్డు మార్గాన బయలుదేరి మ.1:45 గం.లకు టిఆర్సి వ్యూ పాయింట్ చేరుకుంటారు. మ.2 గం.లకు టిఆర్సి వ్యూ పాయింట్ నుండి రోడ్డు మార్గాన బయలుదేరి మ.2:15గం.లకు వసతి గృహం చేరుకుంటారు.
మ.3:30గం.లకు గెస్ట్ హౌస్ నుండి రోడ్డు మార్గాన బయలుదేరి గెస్ట్ హౌస్ బి3 బ్లాక్ చేరుకుంటారు. మ.3:35గం.ల నుండి సా.4:05 గం.ల వరకు సంబంధిత అధికారులు ఉప ముఖ్యమంత్రికి ప్రజెంటేషన్ ద్వారా ప్రాజెక్ట్ వివరాలను వివరిస్తారు. అనంతరం సా.4:05 గం.లకు బి3 బ్లాక్ నుండి అప్పర్ ఇంటెక్ వ్యూ పాయింట్ కు బయలుదేరి సా.4:20గం.లకు అక్కడికి చేరుకుంటారు. సా.4:25 గం.లకు హెలికాప్టర్ ద్వారా బయలుదేరి సా.4:50గం.లకు కర్నూలు విమానాశ్రయం చేరుకుంటారు. సా.4:55 గం.లకు కర్నూలు విమానాశ్రయం నుండి గన్నవరం విమానాశ్రయానికి బయలుదేరి వెళ్తారు.