కార్యక్రమానికి హాజరైన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్
కర్నూల్ బ్యూరో : కర్నూలు నగర శివార్లలోని ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ కార్యాలయంలో కమిషన్ ఛైర్మన్, సభ్యులు, ఏపీసీపీడీసీఎల్ ఎండీ, ట్రాన్స్ కో సీఎండీలు తదితరులతో రాష్ట్ర విద్యుత్ ప్రణాళిక అంశంపై స్టేట్ కోఆర్డినేషన్ ఫోరం సమావేశం నిర్వహించారు. అనంతరం స్థానిక బి.క్యాంపు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ విద్యార్థులకు అందజేసే డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ప్రారంభ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ పాల్గొన్నారు.
అనంతరం విద్యార్థులతో కలిసి జిల్లా కలెక్టర్ రంజిత్ భాష, విజయ్ ఆనంద్ తో కలిసి సహపంక్తి భోజనం నిర్వహించారు. సమావేశంకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్. ఏపీఈఆర్సీ ఇన్చార్జి చైర్మన్ ఠాకూర్ రాంసింగ్, ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ రవి పట్టాన్ శెట్టి, జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా, ఏపీఈపీడీసీఎల్ సీఎండీ పృథ్వి తేజ్ ఇమ్మడి, ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ సంతోష రావు, ఏపీ ట్రాన్స్ కో జెఎండీ అండ్ హెచ్ఆర్ కీర్తి చేకూరి, జిల్లా ఎస్పీ బిందు మాధవ్, జాయింట్ కలెక్టర్ డా. బి.నవ్య, ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్, అసిస్టెంట్ కలెక్టర్ చల్లా కళ్యాణి, ఏపీఈఆర్సీ మెంబర్ ఫైనాన్స్ పీవీఆర్ రెడ్డి, ఏపీఈఆర్సీ కమిషన్ సెక్రటరీ కృష్ణ,ఏపీఎస్పీడీసీఎల్ ఎస్ఈ ఉమాపతి, తదితరులు పాల్గొన్నారు.