ఇవాల్టి నుంచి తిరుమలలో ధనుర్మాసం ప్రారంభమైంది. నేటి నుంచి జనవరి 14వ తేది వరకు శ్రీవారి ఆలయంలో సుప్రభాత సేవ రద్దు చేస్తున్నట్లు టీటీడీ అధికారులు ప్రకటించారు.
నెల రోజులు పాటు సుప్రభాతానికి బదులుగా తిరుప్పావైతో స్వామివారికి మేల్కోలుపు ఉండనుంది. ఇక, 19వ తేదీన శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా వీఐపీ బ్రేక్ దర్శనాలు, అష్టదళపాదపద్మారాధన సేవలను తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు రద్దు చేసింది. రేపు సిఫార్సు లేఖల స్వీకరణను సైతం రద్దు చేసినట్లు టీటీడీ పేర్కొనింది.