Wednesday, January 22, 2025

Stampede – తిరుపతి తొక్కిసలాటపై న్యాయ విచారణకు ఆదేశం

తిరుపతి, ఆంధ్రప్రభ బ్యూరో (రాయలసీమ ) తిరుపతి లో వైకుంఠ ఏకాదశి దర్శనాల టోకెన్ల పంపిణీ సందర్బంగా జరిగిన తొక్కిసలాట ఘటన పై రాష్ట్ర ప్రభుత్వం న్యాయ విచారణ కు ఆదేశించింది. ఈ నెల 8 వ తేదీ రాత్రి తిరుపతి లోని పద్మావతి పార్కు వద్ద టోకెన్ల పంపిణీ సందర్బంగా జరిగిన తొక్కిసలాట లో 6 గురు మరణించాగా మరో 40 మంది దాకా గాయపడిన విషయం తెలిసిందే..

వెంటనే స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం పలువురు అధికారులపై చర్యలు తీసుకుని భాదితుల ఉపశమన చర్యలు కూడా తీసుకున్న విషయం విదితమే. అప్పుడు స్వయంగా తిరుపతి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు న్యాయ విచారణ చేయిస్తామని ప్రకటించారు.

ఆ మేరకు ప్రభుత్వం ఈరోజు రిటైర్డ్ హైకోర్టు జడ్జి జస్టిస్ సత్యనారాయణ మూర్తి to న్యాయ విచారణ కు ఆదేశాలు (జి ఓ నెం 16)జారీ చేసింది. మొత్తం ఘటన కు కారణాలు, ఎవరు బాధ్యులు అనే విషయాలను తేల్చడం తో పాటు ఇటువంటి దుర్ఘటనలు జరగకుండా తీసుకోవాల్సిన చర్యలతో నివేదిక ఇవ్వాలని నిర్దేశించింది. మరో ఆరు నెలల్లో నివేదిక ఇవ్వాలని ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొన్నది

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement