Friday, November 22, 2024

TTD: ఫిబ్రవ‌రి 3 నుంచి తిరుమ‌ల‌లో శ్రీవెంక‌టేశ్వ‌ర‌ ధార్మిక స‌ద‌స్సు…

తిరుమలలో ఫిబ్రవరి 3నుంచి శ్రీ వేంకటేశ్వర ధార్మిక సదస్సు నిర్వహిస్తున్నామని తెలిపారు. శ్రీనివాస దివ్యానుగ్రహ హోమం కార్యక్రమం చేపట్టామని, భక్తులు నుంచి అద్భుత స్పందన వస్తోందన్నారు. నడక మార్గంలో చిరుత పులుల దాడుల అడ్డుకట్టకు రూ.5కోట్లు ఫారెస్ట్ డిపార్ట్ మెంట్ వారికి అందించామని టీటీడీ ఈవో చెప్పారు. టీటీడీ పరిపాలన భవనం పెరేడ్ గ్రౌండ్లో 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. టీటీడీ ఈవో జాతీయ జెండా ఆవిష్కరించారు. ఈ వేడుక‌ల్లో టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

టీటీడీ ఈవో ధర్మారెడ్డి మాట్లాడుతూ… ‘టీటీడీ తరపున వైకుంఠ ఏకాదశికి 10 రోజుల పాటు 6 లక్షల 50 వేల మంది భక్తులకు దర్శనం చేయించాం. ఫిబ్రవరి 16న రథ సప్తమి వైభవంగా నిర్వహిస్తాం. అయోధ్యలో బాల రాముడు విగ్రహ ప్రతిష్ఠరోజు లక్ష లడ్డూలు స్వామి వారికి అందించాం. 25 ఏళ్లు లోపు వారు గోవింద కోటి పదిలక్షల నూట పదహారుసార్లు రాసి తీసుకువచ్చిన వారికి స్వామి వారి బ్రేక్ దర్శనం కల్పిస్తాం. తిరుమలలో ఫిబ్రవరి 3న శ్రీ వేంకటేశ్వర ధార్మిక సదస్సు నిర్వహిస్తున్నాం. శ్రీనివాస దివ్యానుగ్రహ హోమం కార్యక్రమం చేపట్టాం. భక్తుల నుంచి అద్భుత స్పందన వస్తోంది.. నడక మార్గంలో చిరుత పులుల దాడులు అడ్డకట్టకు రూ.5కోట్లు ఫారెస్ట్ డిపార్ట్ మెంట్ వారికి అందించాం. రూ.45కోట్లు ఖర్చుతో కండలేరు నుంచి 40 క్యూసెక్కులకు పాలకమండలి ఆమోదం పొందినది. స్వామి వారి అనుగ్రహంతో డిసెంబర్ 6న తిరుమలలో కుండపోత వర్షం కురిసింది. తిరుమలలో రిజర్వాయర్లు అన్ని నిండాయి. కాషన్ డిపాజిట్ వెనక్కి ఇచ్చే ట్రాకింగ్ సౌకర్యం అందుబాటులోకి తీసుకువచ్చాం’ అని తెలిపారు.

రూ.1100 కోట్లు శ్రీవాణి ట్రస్ట్ ద్వారా నగదు వచ్చింది. 700 ఆలయాలు పూర్తి అయ్యాయి, మిగిలినవి మార్చిలోపు పూర్తి చేస్తాం. చరిత్రలో శ్రీకృష్ణ దేవరాయలు సమయంలో గుళ్లు, గోపురాలు నిర్మాణం చేస్తే.. నేడు సీఎం జగన్ ప్రభుత్వంలో టీటీడీ ఆధ్వర్యంలో శ్రీవాణి ట్రస్ట్ ద్వారా 3316 ఆలయాలు నిర్మాణం జరుగుతోంది. నాలుగున్నర ఏళ్లలో టీటీడీ ధార్మిక ఆలయాలు, సదస్సులు శ్రీకృష్ణ దేవరాయలు సమయం కంటే ఎక్కువగా ఆలయాల నిర్మాణం జరిగింది. తిరుపతిలో అచ్యుతం, శ్రీ పథం గెస్ట్ హౌస్‌లు నిర్మాణం చేస్తున్నాం. దీని ద్వారా 25వేల మందికి వసతి సౌకర్యం అందుబాటులోకి వస్తుంది. సీఎం జగన్ ప్రారంభించిన శ్రీపద్మావతి హార్ట్ కేర్ సెంటర్ ద్వారా 26 నెలల్లో 2350 గుండె ఆపరేషన్స్ విజయవంతంగా నిర్వహించాం. మూడు రోజుల చిన్నారికి గుండె ఆపరేషన్ చేసిన చరిత్ర టీటీడీ శ్రీపద్మావతి చిల్డ్రన్ హార్ట్ కేర్‌దే. 11 గుండె మార్పిడి ఆపరేషన్స్ చేశాం. ప్రపంచంలోనే ఇంత అద్భుతంగా, వేగంగా గుండె ఆపరేషన్స్ జరిగింది లేదు’ అని టీటీడీ ఈవో పేర్కొన్నారు.

- Advertisement -

‘సీఎం జగన్ మోహన్ రెడ్డి చేతుల మీదుగా శ్రీపద్మావతి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ శంకుస్థాపన చేశారు. 250 కోట్లతో చిన్న పిల్లల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణం జరుగుతోంది. 80శాతం పూర్తి అయ్యింది, మరో 20శాతం పనులు పూర్తి కావాల్సి ఉంది. ఎస్వీ వేదిక్ యూనివర్సిటీలో అతీంద్రియ విజ్ఞానం అనే నూతన కోర్సు ప్రారంభించాం. రూ.60కోట్లతో అత్యాధునిక గోశాల నిర్మాణం చేస్తున్నాం. దాన్ని రైతులకు అందుబాటులోకి తీసుకు వస్తున్నాం. 3518 మంది టీటీడీ ఉద్యోగులకు మొదటి విడతలో ఇళ్లు స్థలాలు, రెండో విడతలో 1700 మందికి ఇళ్ల స్థలాలు మంజూరు చేశాం. వెంకటగిరి రోడ్డులో 450 ఎకరాల్లో 5వేల మంది టీటీడీ ఉద్యోగులకు ఇళ్ళ స్థలాలు మంజూరు చేస్తాం. ఫిబ్రవరి నెలాఖరుకు అందిస్తాం’ అని టీటీడీ ఈవో చెప్పుకొచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement