చంద్రగ్రహణం ఉండడంతో తిరుమల శ్రీవారి ఆలయం తలుపులు మూసివేశారు. గ్రహణ సమయానికి 6 గంటల ముందే.. ఆలయం తలుపులు మూసేశారు. అర్థరాత్రి 1.05 గంటల నుంచి 2.22 గంటల మధ్య గ్రహణం ఏర్పడింది. తెల్లవారుజామున 1.05 నుంచి 2.22 గంటల మధ్య పాక్షిక చంద్రగ్రహణం పూర్తయ్యింది.
ఆ తర్వాత ఆలయంను శుద్ది చేసి స్వామివారికి పూజలు నిర్వహించారు. ఇవాళ ఉదయం 9 గంటలకు ఆలయ తలుపులు తెరిచారు.అనంతరం స్వామివారి దర్శనానికి భక్తుల్ని టీటీడీ అనుమతించింది. టీటీడీ స్థానిక ఆలయాల్లో కూడా శుద్ది తర్వాత దర్శనాలకు అనుమతించారు.