తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయంలో జరుగుతున్న పవిత్రోత్సవాలు రెండో రోజు వైభవంగా కొనసాగాయి. వైఖాస అగమ శాస్త్రం ప్రకారం అర్చకులు పవిత్రోత్సవాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. స్వామి వారికి పూజా కార్యక్రమాలు నిర్వహించే సమయంలో ఏవైనా పొరపాట్లు జరిగి ఉన్నా, భక్తుల వల్ల ఏదైనా దోషాలు జరిగిఉంటే తొలగిపోవాలంటూ పవిత్రోత్సవ కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. మొదట స్వామి, అమ్మ వారి ఉత్సవ మూర్తులకు స్నపన తిరుమంజనం కార్యక్రమాన్ని నిర్వహించిన అనంతరం స్వామి వారి మూల విరాట్టుకు అనుబంధ ఆలయాల్లో ఉన్న విగ్రహాలకు పవిత్ర మాలలు సమర్పించడంతో ఈ రోజు కార్యక్రమం ముగిసింది.
Advertisement
తాజా వార్తలు
Advertisement