తిరుమల , ప్రభన్యూస్ ప్రతినిధి: అయోధ్యలో ఈనెల 22న శ్రీరామమందిరం ప్రారంభోత్సవం సందర్భంగా తిరుమల నుంచి లక్ష లడ్డూలను పంపించడం చాలా ఆనందంగా ఉందని టీటీడీ జేఈవో వీరబ్రహ్మం అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 22 న రామమందిరం ప్రారంభోత్సవానికి లడ్డూలను పంపించాలని పాలకమండలి నిర్ణయం తీసుకుందన్నారు.
ఇందులో భాగంగా లక్ష లడ్డూలను నాణ్యమైన నెయ్యితో తయారు చేశామని ఈ లడ్డూలను ప్రత్యేక విమానంలో రేపు అయోధ్యకు పంపించే ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలియజేశారు. లడ్డూలను తయారు చేసేందుకు ఇద్దరు పాలకమండలి సహకరించారని, రేణిగుంట విమానాశ్రయం నుంచి అయోధ్యకు తరలింపునకు ఒక పాలకమండలి సభ్యుడు ప్రత్యేక ఏర్పాట్లు చేశారని చెప్పారు.