Tuesday, November 26, 2024

TTD : వైకుంఠ ఏకాద‌శి టికెట్ల పై కీల‌క ప్ర‌క‌ట‌న‌

డిసెంబర్ 23వ తేదీన శ్రీవారి ఆలయంలో వైకుంఠ ఏకాదశిని వైభవంగా నిర్వహించనున్నారు. వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని డిసెంబర్ 23వ తేదీ నుండి జనవరి 1వ తేదీ వరకూ 10 రోజుల పాటు భక్తులకు టీటీడీ వైకుంఠ ద్వార దర్శనం కల్పించనుంది. గతం కంటే పెద్ద సంఖ్యలో భక్తులకు దర్శనం అవకాశం కల్పించాలని నిర్ణయించింది. ఇందు కోసం టికెట్ల అందుబాటులో ఉంచనున్నట్లు ఈవో ధర్మారెడ్డి వెల్లడించారు.

వైకుంఠ ద్వారా దర్శనం కోసం 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం, శ్రీవాణి ట్రస్టు టిక్కెట్లను ఈ నెల‌ 10వ తేదీన ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. 10 రోజులకీ 2.25 లక్షల ప్రత్యేక ప్రవేశ దర్శనం.. రోజుకి 2వేలు చొప్పున 20 వేల శ్రీవాణి ట్రస్టు టిక్కెట్లను భక్తులకు టీటీడీ ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచనుంది. వచ్చే నెల 21వ తేదీ వేకువజామున సర్వదర్శనం టోకెన్లను తిరుపతిలోని 9 కేంద్రాల్లో జారీ చేయనుంది. 10 రోజుల గానూ 4.25 లక్షల ఎస్డీ టోకెన్లను భక్తులకు జారీ చేయనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement