Wednesday, December 4, 2024

TTD | స్థానికులకు శ్రీవారి దర్శనం.. మార్గదర్శకాలు జారీ

తిరుపతి స్థానిక నివాసితులకు శ్రీవారి దర్శనం కోసం టీటీడీ పాలక మండలి నిర్ణయం తీసుకుంది. ప్రతి నెలా మొదటి మంగళవారం స్థానిక భక్తులకు స్వామి క‌ల్పించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేసింది. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను టీటీడీ విడుదల చేసింది. ఇవి డిసెంబర్ 3 నుంచి అమల్లో రానున్నాయి.

కాగా, డిసెంబర్ 2వ తేదీన తిరుపతిలోని మహతి ఆడిటోరియం, తిరుమలలోని బాలాజీ నగర్ కమ్యూనిటీ హాల్‌లో దర్శన టోకెన్లను ఉచితంగా జారీ చేయ‌నున్నారు. ఈ దర్శనాల కోసం మొత్తం 3 వేల టోకెన్లు జారీ చేయనున్నారు. దర్శన టోకెన్లు ఎవరెవరికి, ఏ ప్రాతిపదికన అనే విషయమై మార్గదర్శకాలు జారీ అయ్యాయి. ఫస్ట్ కం ఫస్ట్ బేసిస్ ప్రయారిటీతో టోకెన్లు జారీ అవుతాయి. టోకెన్ పొందిన భక్తులు దర్శన సమయంలో ఒరిజినల్ ఆధార్ కార్డు చూపించాల్సి ఉంటుంది.

- Advertisement -

స్థానికుల ద‌ర్శ‌నాల‌కు టీటీడీ మార్గ‌ద‌ర్శ‌కాలు..

•⁠ ⁠తిరుపతిలోని మహతి ఆడిటోరియంలో 2,500 టోకెన్లు, తిరుమ‌ల‌లోని బాలాజీ న‌గ‌ర్ క‌మ్యూనిటీ హాల్ లో 500 టోకెన్లు (ఉదయం 3 నుండి ఉదయం 5 గంటల మధ్య) జారీ చేయనున్నారు.

•⁠ ⁠ముందుగా వ‌చ్చిన‌వారికి తొలి ప్రాధాన్య‌త‌తో టోకెన్లు కేటాయిస్తారు.

•⁠ ⁠దర్శన టోకెన్ పొందడానికి స్థానికులు తమ ఒరిజినల్ ఆధార్ కార్డును త‌ప్ప‌నిస‌రిగా తీసుకురావాలి.

•⁠ ⁠టోకెన్లు పొందిన భ‌క్తులు ద‌ర్శ‌న స‌మ‌యంలో ఒరిజిన‌ల్ ఆధార్ కార్డును తీసుకురావాల్సి ఉంటుంది.

•⁠ ⁠వైకుంఠం క్యూకాంప్లెక్స్ లోని ఫుట్ పాత్ హాల్‌(దివ్య ద‌ర్శ‌నం) క్యూలైన్ లో భ‌క్తుల‌ను ద‌ర్శ‌నాల‌కు అనుమ‌తిస్తారు.

•⁠ ⁠ఇతర దర్శనాల్లో ఇచ్చేవిధంగా ద‌ర్శ‌నానంత‌రం ఒక లడ్డూ ఉచితంగా అందించబడుతుంది.

•⁠ ⁠స్థానికుల కోటాలో దర్శనం చేసుకున్న వారికి తిరిగి 90 రోజుల వ‌ర‌కు ద‌ర్శ‌నం చేసుకునేందుకు అవకాశం ఉండదు.

భారీ వర్షాలతో శ్రీవారిమెట్టు మార్గం మూసివేత…

మ‌రోవైపు, ఫెంగల్ తుపాను కారణంగా తిరుమలలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా తిరుమలలో జలాశయాలు నిండుకుండలా మారాయి. గోగర్భం డ్యామ్ పూర్తిగా నిండిపోగా.. అధికారులు నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.

భారీ వర్షాలు, కొండచరియలు విరిగి పడుతున్న నేపథ్యంలో టీటీడీ అధికారులు ముందుజాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. పాపవినాశనం, శ్రీవారిమెట్టు మార్గాలను టీటీడీ అధికారులు తాత్కాలికంగా మూసివేశారు. అలాగే కొండపై నుంచి వరద ప్రవాహం అధికంగా ఉండటంతో తిరుపతి కపిలతీర్థంలోని పుష్కరిణిలోకి భక్తులను అనుమతించడం లేదు. అలాగే భక్తులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement