Friday, November 22, 2024

Tirumala: ఐదు రోజుల పాటు శ్రీవారి వార్షిక తెప్పోత్సవాలు..పలు సేవలు ర‌ద్దు…

తిరుమలలో ఇవాళ్టి నుంచి ఐదు రోజుల పాటు శ్రీవారి వార్షిక తెప్పోత్సవాలు జరగనున్నాయి. ఆలయం పక్కనే ఉన్న పుష్కరిణిలో స్వామి వారు విహరించనున్నారు.శ్రీవారి తెప్పోత్సవాల సందర్భంగా పలు సేవల్ని రద్దు చేశారు.

ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకరణ సేవలను టీటీడీ రద్దు చేసింది. మార్చి 20, 21వ తేదీల్లో సహస్రదీపాలంకార సేవను రద్దు చేశారు. అంతకాదు మార్చి 22, 23, 24వ తేదీల్లో ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలను రద్దు చేసినట్లు టీటీడీ తెలిపింది. భక్తులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని టీటీడీ సూచించింది.

- Advertisement -

ఇవాళ సీతా లక్ష్మణ ఆంజనేయ సమేతంగా రామచంద్రమూర్తి తెప్పపై మూడు చుట్లు తిరిగి భక్తులకు కనువిందు చేయనున్నారు. రెండో రోజున(21న) రుక్మిణీ సమేతంగా శ్రీకృష్ణస్వామివారు తెప్పలపై మూడుసార్లు విహరిస్తారు. మూడో రోజున(22న) శ్రీభూ సమేతంగా మలయప్పస్వామి మూడుసార్లు పుష్కరిణిలో విహరించి, భక్తులను అనుగ్రహిస్తారు. నాల్గవ రోజున ఐదుసార్లు, చివరిరోజు ఏడుసార్లు తెప్పపై పుష్కరిణిలో విహరిస్తారు. తిరుమలలో శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలలో ప్రతి రోజు రాత్రి 7 గంటల నుంచి 8 గంటల వరకు పుష్కరిణిలో స్వామి, అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement