అమరావతి, ఆంధ్రప్రభ: వర్షాభావ పరిస్థితు లు ఏర్పడి ఖరీఫ్ సీజన్ గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటు-న్న నేపథ్యంలో కృష్ణా బేసిన్‌కు ఎగువన ఉన్న ప్రాజెక్టుల్లోకి నీరు వడివడిగా ప్రవహిస్తుండటం ఆశలు రేపుతోంది. కర్ణాటక లోని ఆల్మట్టి జలాశయం పూర్తిస్థాయి నిల్వ సామర్ద్యానికి చేరువవుతోంది. ఒకటి రెండు రోజుల్లోనే ప్రాజెక్టు నిండే అవకాశం ఉందనీ, ఆ తరువాత భారీ అవుట్ ప్లnోకి అవకాశం ఉంటు-ం దని అంచనా. మంగళవారం సాయంత్రం నాటికి ఆల్మట్టి జలాశయంలో 129.72 టీ-ఎంసీల గరిష్ట సామర్ద్యానికి గాను 126.01 టీ-ఎంసీల నిల్వలున్నాయి. ఆల్మట్టికి ఎగువ నుంచి ఇన్ ప్లnో రూపంలో 58,484 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుండగా అవుట్ ప్లnో రూపంలో దిగువకు 62,397 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. మహారాష్ట్రలోని పశ్చిమ తీరంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల దిగువన ఉన్న కర్ణాటకలోని ఆల్మట్టికి వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది. ఆల్మట్టికి అనుసంధానంగా ఉన్న ఆరు పవర్ హౌస్ ల నుంచి విద్యుదుత్పత్తి చేస్తుండటం వల్ల ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నిండకపోయినా అనివార్యంగా దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. అందువల్లనే ఇన్ ప్లnో కన్నా అవుట్ ప్లnో ఎక్కువగా ఉంది.
ఒకటి రెండు రోజుల్లో ఇంతకుమించి భారీగా వరద నీరు భారీగా చేరుతుందని అంచనా. ఆల్మట్టి నుంచి వరద నీటిని దిగువకు విడుదల చేస్తే తెలుగు రాష్ట్రాల్ల్రోని నారాయణపూర్, జూరాల, తుంగభద్ర..ఆ తరువాత శ్రీశైలం, నాగార్జున సాగర్ కు వరద నీరు చేరే అవకాశం ఉంది. ఆల్మట్టికి దిగువున్న జూరాలలో మంగళవారం సాయంత్రం నాటికి 9.66 టీ-ఎంసీ గరిష్ట సామర్ద్యానికి గాను 8.85 టీ-ఎంసీలు, నారాయణపూర్ లో 37.64 టీ-ఎంసీలకు గాను 35.51 టీ-ఎంసీలు, తుంగభద్ర ఏపీ బార్డర్ లో 100.86 టీ-ఎంసీలకు గాను 86.24 టీ-ఎంసీల నిల్వలున్నాయి. శ్రీశైలంకు ఎగువన ఉన్న ప్రతి జలాశయంలో గరిష్ట సామర్దంలో 90 శాతానికి మించి నీరు చేరింది. కృష్ణా పరీవాహక ప్రాంతాల్లో స్థానికంగా వర్షాలు లేకపోవటంతో ఎగువ నుంచి వచ్చే వరదనీటిపైనే శ్రీశైలం, సాగర్ లు ఆధారపడి ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఎగువన ఉన్న ఆల్మట్టి తో పాటు- ఇతర జలాశయాలు జలాశయం గరిష్ట సామర్ద్యానికి చేరువ కావటంతో శ్రీశైలం కూడా తొందరలోనే జలకళ సంతరించుకుంటు-ందని అంచనా.
శ్రీశైలంలో 117 టీ-ఎంసీలు
వర్షాల్లేక, వరదలు రాక అడుగంటిన శ్రీశైలం జలాశయంలో నీటి నిల్వలు క్రమేపీ పెరుగుతున్నాయి. మంగళవారం సాయంత్రం నాటికి 215 టీ-ఎంసీల గరిష్ట సామర్ద్యానికి గాను జలాశయంలో 117 టీ-ఎంసీల నీరు చేరింది. ఎగువ నుంచి ఇన్ ప్లnో రూపంలో 52,464 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. నాగార్జున సాగర్ లోనూ 312 టీ-ఎంసీలకు గాను 140 టీ-ఎంసీల నిల్వలున్నాయి. పులిచింతలో 45.77 టీ-ఎంసీలకు గాను 33.4 టీ-ఎంసీలు, కృష్ణా బేసిన్ కు దిగువన ఉన్న ప్రకాశం బ్యారేజిలో 3.07 టీ-ఎంసీలకు గాను 2.43 టీ-ఎంసీల నిల్వలున్నాయి.