శ్రీశైలం ఆలయ ప్రాంగణంలో నాగుపాము కలకలం రేపింది. . ఉమా రామలింగేశ్వర స్వామి మండపంలో ఆదివారం త్రాచు పామును గుర్తించారు. కార్తీక మాసం సందర్భంగా శ్రీశైలం క్షేత్రంలో భక్తుల రద్దీ అధికంగా ఉంది. ఆ సమయంలోనే పాము సంచరించడానికి గమనించిన భక్తులు దేవస్థానం అధికారులకు తెలియజేశరాు. వారు వెంటనే స్నేక్ క్యాచర్ రాజాకు సమాచారం అందించారు. 8 అడుగుల త్రాచు పామును అతడు పట్టుకోవడంతో భక్తులు ఊపిరి పీల్చుకున్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement